బాబుకు దొరికిన విలువైన ఆస్తి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 02:39:24

బాబుకు దొరికిన విలువైన ఆస్తి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆంధ్రా మేధావులు ఫోర‌మ్ ప్ర‌సిడెంట్ చ‌ల‌సాని శ్రీనివాస్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న జ‌గ‌న్ కు ప‌లు కీల‌క స‌ల‌హాలు, సూచ‌న‌లు  ఇచ్చారు. 
 
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో ఓ గొప్ప పోరాట యోధుడిని చూశానని చెప్పిన చ‌ల‌సాని... జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించినందుకు క‌క్ష్య‌తో కేసులు పెట్టార‌ని, ఆయ‌న నేర‌స్తుడు కాదు...కేవ‌లం నిందితుడ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఆయ‌న‌లో ఆయ‌న‌కు కొంత మార్పు చాలా అవ‌స‌ర‌మ‌ని చ‌ల‌సాని, జ‌గ‌న్ కు స‌ల‌హా ఇచ్చారు.
 
జ‌గ‌న్ వెంట న‌డిచే రోజా, చెవి రెడ్డి భాస్క‌ర్ రెడ్డి లాంటి వారు ప‌ద‌ప్ర‌యోగం చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చంద్ర‌బాబు నాయుడుకి దొరికిన పెద్ద ఆస్తి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, అప్పులు ప‌ప్పుగారూ ఆయ‌న చుట్టూ ఉన్నా మీడియా అడ్వైజ‌ర్లు అని ఎవ‌రో అంటుంటే తాను విన్నాన‌ని చ‌ల‌సాని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.