ఆ నాయకుడి చూపు వైసీపీ వైపా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 15:49:47

ఆ నాయకుడి చూపు వైసీపీ వైపా

క‌ర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేత‌లు చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు... రాజ‌కీయాల్లో బాబు కంటే సీనియ‌ర్ అయిన కే.ఈ సొంత జిల్లాకూడా ఇదే.. తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం క‌ర్నూలు జిల్లా ప్రముఖ టిడిపి నేత చల్లా రామ కృష్ణారెడ్డి టీడీపీ పై గుర్రుగా ఉన్నారు అని తెలుస్తోంది. ఆయ‌న ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు ప‌లు ఆలోచ‌న‌ల‌న‌కు తావిస్తున్నాయి.దీనికి కార‌ణం చల్లాకి ప్రకటించిన నామినేటెడ్ పోస్టే కార‌ణం అని తెలుస్తోంది.
 
సిఎం చంద్రబాబు తనకు కేటాయించిన నామినేటెడ్ పదవిపై చల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు, ఇంకా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.... త‌న‌కు ప‌ద‌వి ఇవ్వక‌పోయినా ప‌ర్వాలేదు ఇలాంటి ప‌ద‌వి ఇచ్చి త‌న‌ను కించ‌ప‌రిచారు అని, అవ‌మానించారు అని  ఆయ‌న అన్నారు.. త‌న కంటే జూనియ‌ర్ల‌కు రాష్ట్ర స్దాయి ప‌ద‌వులు ఇచ్చి త‌న‌కు జిల్లా స్దాయి ప‌ద‌వి ఇచ్చారు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.  ఈ ప‌ద‌వి తాను చేయ‌ను అని తెలియ‌చేశారు.
 
రాజశేఖర్ రెడ్డి చనిపోయాక టిడిపిలో చేరి ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసిన తనకు మరీ ఇంత చిన్న పదవి ఇవ్వడం ఏమిటని అని ఆయన మథనపడుతున్నారు. అంతే కాదు జిల్లాలో ఆయ‌న సీనియ‌ర్ అని తెలియ‌చేస్తున్నారు.ఒకే పార్లమెంట్‌ పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డు తన సొంతమని చల్లా అంటున్నారు....
 
అసలు రాయలసీమలో చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తిల తర్వాత తానే అత్యంత సీనియర్ నాయకుడినని ఆయ‌న వెల్ల‌డించారు.. నాలుగు సంవ‌త్స‌రాల నిశ్శ‌బ్దానికి ఇదేనా టీడీపీ  బ‌హుమానం అని ఆయ‌న విమ‌ర్శించారు.. త‌నకు  ప‌ద‌వి ఇవ్వ‌మ‌ని అడ‌గ‌లేదు అయినా నాకు ఈ ప‌ద‌వి ఇచ్చారు... త‌న‌కు గ‌తంలో ఎమ్మెల్సీ ఇస్తాను అని అన్నారు ఆ మాట కూడా నిల‌బెట్టుకోలేదు.. త‌న కేడ‌ర్ తో  చ‌ర్చించి త‌దుప‌రి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ  తెలియ‌చేస్తాను అని చెప్పారు.. ఇక ఆయ‌న తాజా కామెంట్ల బ‌ట్టీ తెలుగుదేశంలో ఎంత ఓపిక‌గా ఉన్నా ఇలాగే ఉంటుంది అని, అందుకే వైసీపీ వైపు ఆయ‌న అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.