చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకోవ‌ద్దు ప్లీజ్..!

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-24 18:02:07

చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకోవ‌ద్దు ప్లీజ్..!

తెలుగు రాష్ట్రాల్లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ ప్ర‌చారం ప‌తాక స్థాయికి చేరుకోవ‌డంతో రాజ‌కీయ దురందురులు వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు ఇంకా ఎనిమిది నెల‌ల‌ స‌మ‌యం ఉన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు నెల‌ల ముందే ఎన్నికల‌కు సిద్ధ‌మ‌వ్వ‌డంపై ప్ర‌తిప‌క్షాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే చ‌రిత్ర మాత్రం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే అధికార పార్టీలు ఓట‌మి పాల‌వ్వ‌డం ఖాయ‌మ‌ని ఘంటాప‌ద‌మ‌ని తెలుస్తోంది. మ‌రి దీనిపై సీఎం చంద్ర‌బాబు, సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 
 
సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల్లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అల‌ర్ట్ చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వేలు త‌యారు చేస్తున్నారు. హ‌స్తిన ప‌ర్య‌ట‌న అనంత‌రం సెప్టెంబ‌ర్ లో  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల్ని ఖరారు చేస్తామ‌ని ప్ర‌జ‌ల్లో ముందుస్తు ఆలోచ‌న‌ల‌ను రాజేశారు. అయితే దీనిపై రాజ‌కీయ ఉద్దండులు మాత్రం హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.
 
సీఎం చంద్ర‌బాబు కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టేసి మ‌రోమారు అధికారం చేప‌ట్టాల‌ని ఉవ్విళ్లురుతున్నారు. ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్ పై ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. మంత్రుల‌తో వ‌రుస