తండ్రి కుమారుడుకి విజ‌య‌సారెడ్డి ముచ్చెమ‌ట‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vijaya sai reddy
Updated:  2018-09-24 12:17:00

తండ్రి కుమారుడుకి విజ‌య‌సారెడ్డి ముచ్చెమ‌ట‌లు

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు విజ‌య‌సాయి రెడ్డి వ‌రుస ట్వీట్లు చేస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ఆయ‌న కుమారుడుకి ముచ్చెమ‌ట‌లు పుట్టిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు క‌ట్టించి ఒక్క‌టే ప్రాజెక్ట్ అనే టైటిల్ పెట్టి ప్ర‌శ్నించారు విజ‌య‌సాయిరెడ్డి.  టీడీపీ నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల పాల‌న‌లో అటు రైతుల‌కు ఇటు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేది ఒక్క‌టంటే ఇక్క ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌లేదు.
 
వేల కోట్లు ఖ‌ర్చు అవుతున్నా పోల‌వ‌రం నుంచి వెలుగోడు వ‌ర‌కు అనేక ప్రాజెక్టులు న‌త్త‌న‌డ‌క‌గా సాగుతున్నాయి. అయితే  చంద్ర‌బాబు నాయుడు  విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక‌టే ఒక‌టి.. అది మంగ‌ళ‌గిరిలో టీడీపీ కార్యాలాయం భ‌వ‌ణం ..ఆఘ‌మేఘాల‌పై అంగ‌రంగా వైభ‌వంగా కట్టేశారు. రేపు నా చిత్తశుద్దికి ఇదే చిహ్నం అని ఆయ‌న ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. 
 
మ‌రోట్వీట్ చేస్తూ కాల్ మ‌నీ రాకెట్ ను మించిపోతున్న చంద్ర‌బాబు ఆగ‌డాలు....
డ్వాక్రా రుణాల‌న్నింటిని మాఫీ చేస్తాన‌ని ఎన్నిక‌ల్లో గంభీరంగా  గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అయితే ఇన్నెళ్ల‌లో 14 వేల డ్వాక్రా రుణాలలో ఒక్క రూపాయి కూడా చెయ్య‌లేద‌ని సాక్షాత్తు రాష్ట్ర మంత్రే నిన్న‌గాక మొన్న అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. చివ‌ర‌కు వ‌డ్డీ రాయితీ కూడా చెల్లించ‌కుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు హామీల‌ను నెర‌వేర్చ‌నందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ధ‌న్య‌వాదాలు అంటూ డ్వాక్రా మ‌హిళ‌ల నుంచి బ‌ల‌వంతంగా ప‌త్రాల మీద సంత‌కం సేక‌రించ‌డానికి స్కెచ్ వేశారు. బాబు ఆగ‌డాల‌ను కాల్ మ‌నీ రాకెట్ ను మించిపోతున్నాయి.
 
మ‌రో ట్వీట్ చేస్తూ..
 
ఐటీలో ల‌క్ష‌లాది ఉద్యోగాలు వ‌చ్చేస్తున్నాయంటూ ఊరూవాడ తిరిగి డ‌బ్బా కొట్టుకుంటున్న లోకేశ్ నాయుడికి గాలి తీసింది కాగ్ నివేదిక. ఆయ‌న ఐటీ పాల‌సీలు అధ్య‌హ్నం. వాటి అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ నాసిర‌కం, ఉద్యోగాల క‌ల్ప‌న‌లో వైఫ‌ల్యం. ఏతావాతా 2017 జులైనాటికి ఐటీ రంగంలో క‌ల్పించింది. కేవ‌లం 4326 ఉద్యోగాలు మాత్ర‌మే ఇది కాగ్ నివేదిక బ‌య‌ట పెట్టిన నివేదిక నిజం! మ‌రి 2019 క‌ల్లా ల‌క్ష ఉద్యోగాల మాటేమిటి... ముందొచ్చిన చెవుల‌కంటే కొమ్మ‌ల వాటి క‌దా! బూట‌కు ప్ర‌చారంలో తండ్రిని మించిన త‌న‌యుడు. అంటూ ట్వీట్ చేశారు విజ‌య‌సాయిరెడ్డి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.