ఎమ్మెల్యేల‌కు బాబు మ‌రో ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap cm nara chandrababu naidu image
Updated:  2018-03-06 07:03:18

ఎమ్మెల్యేల‌కు బాబు మ‌రో ఆఫ‌ర్

రాష్ట్ర జీడీపీ దేశ జీడీప‌క‌న్నా పెరిగిపోతోంది అని... ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఎటువంటి నిధులు అక్క‌ర్లేదు అనే విధంగా పేప‌ర్లు చెబుతాయి ఇవ‌న్ని చూసి ల‌చ్చ‌ల కోట్ల పెట్టుబ‌డులు ఏపీకి వ‌స్తున్న‌ప్పుడు మ‌నం ఏపీని ఆధుకోవ‌డం ఏమిటి ఏపీయే మ‌న‌ల్ని ఆదుకుంటుంది అనేలా ఉంద కేంద్రం దీంతో ఈ బండారం ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయింది ఈ ఆస్ధాన‌మీడియాలు రాయ‌డం చూసి చెప్ప‌డం విని ఆంధ్రాప‌రుగులు పెడుతోంది అనుకుంటే అంత‌కంత‌కూ రెవెన్యూ లోటు ఆకాశానికి ఎక్కుతోంది.
 
రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకి ఆర్థిక లోటు ఉన్న విష‌యం అంద‌రికి తెలిసిందే అది ఎంత అంటే గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా అయితే ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అప్పులు తెచ్చి అభివృద్ది చేశాము అంటున్నారు అది ఏమాత్రం క‌నిపించ‌డం లేదు అంటోంది ఇటు వైసీపీ.. రాష్ట్రంలో ప్ర‌జారంజ‌క పాల‌న జ‌రుగుతోంది అని ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు... ఇంత ఆర్దిక లోటు ఉన్నా ఏపీకి ల‌చ్చ‌ల కోట్ల పెట్టుబ‌డులు అంటూ దావోస్ అమెరికా సింగపూర్ యాత్ర‌లు చేయ‌డం. అక్క‌డ నుంచి ఇక్క‌డ‌కు రూపాయి పెట్టుబ‌డులు కూడా తీసుకురాక‌పోవ‌డం ఇదే తంతు గ‌త నాలుగేళ్లుగా జ‌రుగుతోంది.
 
ఇక విభ‌జ‌న త‌రువాత రాష్ట్రంలో అధికారం చేప‌ట్టిన టీడీపీ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల సొమ్మును  విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తోంది.... రాష్ట్రం ప్ర‌జ‌ల మీద‌ అన్ని విధాలా ప‌న్నులు పెంచుతూ సామాన్యులను మ‌రింత వెన‌క్కునెట్టుతోంది టీడీపీ ప్ర‌భుత్వం.
 
రాష్ట్రంలో ఉన్న రైతులు, కార్మికులు, బ‌లహీన వ‌ర్గాల ప్ర‌జ‌లు జీవించ‌డానికి ఆస్కారం లేకుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంటోంది. అయితే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో బీజేపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇళ్ల అద్దెలకు ఇచ్చే న‌గ‌దు  పెంచాల‌ని కోరారు... దీనికి స్పందించిన సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఇస్తున్న 50 వేల రూపాయ‌ల‌కు అద‌నంగా  మ‌రో   50 వేల రుపాయ‌లు పెంచారు. అయితే ఇక్క‌డ ఓ మెలిక పెట్టారు..ఈ విధానం కేవ‌లం విజయవాడలో నివ‌సించే  ఎమ్మెల్యేలకు మాత్ర‌మే అని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.