చంద్ర‌బాబుకు స‌భ‌లో నిరాశ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu jyoti rao phule jayanthi
Updated:  2018-04-11 06:35:38

చంద్ర‌బాబుకు స‌భ‌లో నిరాశ

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు నిరాశ ఎదురైంది... మ‌హాత్మ జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజూ విజ‌యవాడ‌లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పూలే విగ్ర‌హానికి పూల మాల‌వేసి నివాళులు అర్పించారు... ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే కుటుంబం దేశానికి చేసిన సేవ‌లు అంతా ఇంతా కాద‌ని వారి త్యాగం చిర‌స్మ‌ర‌నీయమ‌ని అన్నారు.
 
ప్ర‌జ‌ల‌ను విద్యావంతుల‌ను చేసేందుకు పూలే ప్ర‌తీ ఊరు వాడా తిరిగి నిరుద్యోగుల‌కు చ‌దువును నేర్పించార‌ని  ముఖ్య‌మంత్రి అన్నారు... అంత‌టి మ‌హాను బావుడు మ‌న‌దేశంలో పుట్ట‌డం త‌న‌కు చాలా గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని అన్నారు.... రానున్న రోజుల్లో జ్యోతిరావు పూలే అశించిన విధంగా ప్ర‌తీ ఒక్క‌రిని విద్యావంతుల‌ను చేసేందు కృషి చేస్తామ‌ని ముఖ్యమంత్రి సూచించారు.
 
అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వెనుకబడిన వర్గాలకు వెన్నెముక అని, వారి సంక్షేమం కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. వెనుక బడిన వర్గాల కోసం బడ్జెట్ లో  ప్రత్యేకంగా నిధులు కేటాయించామని చంద్ర‌బాబు పేర్కొన్నారు... అయితే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై వెనుబ‌డిన వ‌ర్గాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం చేశాయి...
 
కొంద‌రు అక్క‌డే వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.గంగిరెడ్ల కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికలకు ముందు తమను ఎస్సీల్లో చేరుస్తామన్న ముఖ్యమంత్రి... ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. సభలో కనీసం తమ గురించి ప్రస్తావించలేదని వారు అసహనం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.