లక్ష్మీనారాయణ వెనుక ఉన్న‌ది ఎవరో తెలిసింది?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jd lakshmi narayana and chandrababu naidu
Updated:  2018-04-05 18:01:14

లక్ష్మీనారాయణ వెనుక ఉన్న‌ది ఎవరో తెలిసింది?

మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వెనుక ఎవ‌రు ఉన్నారు... రాజ‌కీయంగా ఆయ‌న ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్త వినిపించ‌గానే అంద‌రికి తొలిచిన ప్ర‌శ్న ఇదే... మాజీ జేడీ ల‌క్షీనారాయ‌ణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ అన‌గానే ఏపీలోనా తెలంగాణ‌లోనా అని ఓ ఆలోచన వ‌చ్చింది... అయితే ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరుతారు అని కొంద‌రు అంటుంటే బీజేపీలో చేరుతారు అని కొంద‌రు అంటున్నారు.. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ప్ర‌కారం.
 
ల‌క్ష్మీనారాయ‌ణ పొలిటిక‌ల్ ఎంట్రీ వెనుక సీఎం చంద్ర‌బాబు ఉన్నారు అని తెలుస్తోంది... దీనిపై ఓ మీడియా క‌థ‌నం వెల్ల‌డించింది..  స‌మ‌యం బ‌ట్టీ రాజ‌కీయ పావులు క‌దిపే బాబుగారు ల‌క్ష్మీనారాయ‌ణ‌ను రాజ‌కీయాల్లో దింపార‌ని వెల్ల‌డిస్తోంది ఆ క‌థ‌నం.. అయితే ప‌వ‌న్ ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌డంతో రాజ‌కీయంగా కాపులు తెలుగుదేశానికి దూరం అవుతున్నారు.. మ‌రో ప‌క్క వైసీపీ ఏపీలో పుంజుకుంటోంది... మెజార్టీ కాపు సీట్లు కోస్తాలో గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపులు దూరం అవుతారు అనే డైల‌మాలో ఉంది.
 
అందుకే జేడీని రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి కాపు ఓట్లు చీల్చాలి అని ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.. ల‌క్ష్మీనారాయ‌ణ  కొత్త పార్టీ పెట్ట‌నున్నారు అని తెలుస్తోంది. ఇక మేధావులు కొంద‌రు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆయ‌న పార్టీలో చేర‌తారు అని తెలుస్తోంది.. ఆ క‌థ‌నం ప్ర‌కారం బాబు రాజ‌కీయంగా ల‌క్ష్మీనారాయ‌ణ‌, చేత పార్టీ పెట్టించి ఇక్క‌డ ఓట్లు చీల్చే ప్ర‌క్రియ‌లో ఉన్నారని  విశ్లేష‌ణ అర్దం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.