బాబు ఈ విష‌యంలో బ్యాక్ స్టెప్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 11:47:26

బాబు ఈ విష‌యంలో బ్యాక్ స్టెప్

దేశంలో ఇప్పుడు జ‌మిలి ఎన్నిక‌ల హీటు పెరిగింది.. ఓప‌క్క  జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్న‌ట్లు కేంద్రంలో క‌ద‌లిక‌లు వ‌స్తున్నాయి.. ఇప్ప‌టికే ఆయా రాష్టాల కీల‌క నేత‌ల‌కు త‌మ స‌పోర్ట‌ర్ పార్టీల‌కు ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు కూడా తెలుస్తోంది.. ఇక జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే మ‌రో ఆరు నెలల్లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. అయితే పంచాయ‌తీ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు కూడా కంగారుప‌డుతున్న బాబు స‌ర్కారు, ఈ జ‌మిలి కి సిద్దం అవుతుందా. జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే తెలుగుదేశం ఎటువంటి వ్యూహాలు అమ‌లుప‌ర‌చ‌నుంది పైగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కూడాచేయాలి అని అనుకుంటున్నారు చంద్ర‌బాబు అని ఇటు స‌ర్కారుపై ఇప్ప‌టికే వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
దేశంలో మందుస్తు ఎన్నిక‌ల జోరు పెర‌గ‌డంలో  తెలుగుదేశం వైసీపీ కంటే ముందే వ్యూహాలు వేస్తోందా అంటే నో అనే చెప్పాలి.. ఇటు తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ముందే ఎన్నిక‌ల పై క్లారిటీ ఇచ్చారు.. ఆగ‌స్టులోనే అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న  కూడా చేయ‌బోతోంది  గులాబీ పార్టీ...అయితే తెలుగుదేశం మాత్రం ఇంకా స‌ర్వేలు, డ్యాష్ బోర్డులు అంటూ ఆలోచిస్తోంది.
 
ఇక మ‌రోసారి కేసీఆర్ దానం నాగేంద‌ర్ ను పార్టీలో చేర్చుకున్న స‌మ‌యంలో తాము ఎన్నిక‌ల‌కు రెడీ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ ఎస్ సిద్ద‌మే అని స్ప‌ష్టంచేశారు. ఇక కాంగ్రెస్ కూడా సిద్ద‌మే... అయితే తెలుగుదేశం తెలంగాణ‌లో ఎలా ఉన్నా, ఏపీలో అధికారంలో ఉంది. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం రెడీ అవుతోంది.. ఈ సారి బాబేనా లేక లోకేష్ ని ముందు పెట్టి ఎన్నిక‌ల‌కు వెళ‌తారా అనే కొత్త ఆలోచ‌న అంద‌రిని ఆలోచించేలా చేస్తోంది.
 
మ‌న ఏపీలో మూడుసార్లు మంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చాయి.. తెలుగుదేశం పార్టీ స్దాపించిన ఎన్టీఆర్ ఏపీలో దూసుకుపోతున్నారు పార్టీపెట్టిన స‌మ‌యంలో.. స‌భ‌ల‌కు జ‌నాలు హూరెత్తి వ‌స్తున్నారు.. ఈ స‌మ‌యంలో మ‌న‌కు ఓట‌మి త‌ధ్యం అని భావించిన హ‌స్తం పార్టీ,  కాస్త అయినా ఈ ఎఫెక్ట్ మ‌న‌పై ఉండ‌కూడ‌దు అని కాంగ్రెస్ భావించింది.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లింది 1983 లో... కాని కాంగ్రెస్ కు  భారీ ఎదురుదెబ్బ త‌గిలింది... ఇక అధికారం చేతికి  వ‌చ్చిన త‌ర్వాత రెండోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు 1989 లో ముందుకు వ‌చ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే టీడీపీ ఓట‌మితో ఈ ఎన్నిక‌ల్లో కంగుతింది.
 
ఇక తొమ్మిదేళ్ల బాబు పాల‌న‌కు మ‌రోసారి కూడా త‌మకు విజ‌యం అని అనుకున్నారు చంద్ర‌బాబు.. హ్యాట్రిక్ కొడ‌దామ‌ని అనుకున్న తెలుగుదేశం 2003లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వ‌చ్చింది.. అయితే వైయ‌స్ సార‌థ్యంలో కాంగ్రెస్ హిట్ కొట్టింది.. ఏకంగా క‌నివిని ఎరుగ‌ని రీతిలో సౌత్ లోనే టాప్ స్టేజ్ కు ఏపీ సీట్లు  సాధించింది కాంగ్రెస్.. దీంతో టీడీపీ అధినేత‌కు షాక్ కొట్టింది.
 
2014, జూన్ 8న అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ, అంటే 2019 జూన్ 7 వ‌ర‌కూ టీడీపీకి ఏపీ పాల‌న‌కు ప్ర‌జ‌లు స‌మ‌యం ఇచ్చారు.. అప్ప‌టి వ‌ర‌కూ వారు రూలింగ్ లో ఉండ‌వ‌చ్చు.. అయితే ఇప్పుడు ప‌రిస్దితిని ఆలోచిస్తే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎవ‌రు వ‌చ్చినా ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ దారుణంగా ప‌రాజ‌యం పాలైంది.. అలాగే కాంగ్రెస కూడా ప‌రాజ‌యం పాలైంది.. దీనిని బ‌ట్టీ చూస్తే అధికార పార్టీలు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే గెలిచే అవ‌కాశాలు చాలా త‌క్కువ.. అందుకే టీడీపీ సీనియ‌ర్లు కూడా ఇదే విష‌యంలో వెన‌క‌డుగు వేస్తున్నారు..
 
ఇటు యువ‌నాయ‌కులు మాత్రం ముందుకు వెళ‌దాం అంటున్నారు.. అదే బాట‌లో తెలుగుదేశం నాయ‌కులు కూడా మంత్రిలోకేష్ తో ముందుకు వెళ్లాలి అని అనుకుంటున్నారు.. అయితే లోకేష్ మిగిలిన మంత్రుల కోట‌రీ మాత్రం ముంద‌స్తుకు మేము వ్య‌తిరేకం ఐదేళ్ల పాల‌న చేస్తాం అంటున్నారు.
 
ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఎన్నిక‌ల సంఘం చెప్పేదాని ప్ర‌కారం అర్దంచేసుకోవాల్సింది.. ఏదైనా ప్ర‌భుత్వ పాల‌న స‌మ‌యం ముగియ‌డానికి ఆరు నెల‌ల లోపు మాత్ర‌మే ఎన్నిక‌లు నిర్వ‌హించాలి అని స్ప‌ష్టంగా తెలియ‌చేస్తోంది. అంటే మ‌న ప్ర‌భుత్వాల‌కు జూన్ 7 వర‌కూ స‌మ‌యం ఉంది...ఈలోపు అంటే ఆరునెల‌ల ముందు అంటే జ‌న‌వ‌రి 7-2019 లోపు ఆ రాష్ట్ర‌కేబినేట్ ర‌ద్దు చేసి గ‌వ‌ర్న‌ర్ ను కోరి ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌మ‌ని కోరితే ,ఎన్నిక‌ల సంఘం ముందుకు వెళుతుంది ఇది లెక్క.. మ‌రి తెలుగుదేశం రెడీనా అంటే బ్యాక్ స్టెప్ వేస్తోంది.. ఇటు టీడీపీ ఎలా ఉన్నా వైసీపీ మాత్రం ముందుకు వ‌స్తోంది సై అంటోంది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.