అఖిల ప్రియ‌కు ఏవీ సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-18 16:48:40

అఖిల ప్రియ‌కు ఏవీ సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు బిగ్ షాక్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌రకు వ‌స్తున్న త‌రుణంలో రాయ‌ల‌సీమలోని రాజ‌కీయం అగ్నిగుండంలా రగిలిపోతోంద. ముఖ్యంగా క‌ర్నూల్ జిల్లాలోని రాజ‌కీయాన్ని గ‌మ‌నించిన‌ట్లయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌క‌లు జిల్లా వ్యాప్తంగా రోజుకొక రంగు పూసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
ఇక ఆళ్ల‌గ‌డ్డ‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి అఖిల ప్రియ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆళ్ల‌గ‌డ్డ నుంచి తాను త‌ప్ప ఎవ్వ‌రు పోటీ చేయ‌ర‌ని త‌న గెలుపు త‌థ్య‌మ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు. కానీ ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆమె పై కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన‌ట్టు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఎందుకంటే కొద్దిరోజుల క్రితం, అఖిల ప్రియ కుంటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్న‌వ్యక్తి ఏవీ సుబ్బారెడ్డి పై దాడి చేయించిన సంగ‌తి తెలిసిందే. ఇక వీరిని రాజీ చేయించ‌డానికి అమ‌రావ‌తి అడ్డాగా మారింది. అయితే రాజీ అయిన 24 గంట‌ల‌లోపే మంత్రి అఖిల ప్రియ, ఏవీ పై మ‌రోసారి అటాక్ చేయించారు. ఇక దీంతో పాటు ఈ మ‌ధ్య కాలంలో అఖిల ప్రియ‌ వైసీపీ కి స‌పోర్ట్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బాబు నాయుడు ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. 
 
ఇక ఏవీని చంద్ర‌బాబు స్పెష‌ల్ గా అమ‌రావ‌తికి పిలిపించుకుని ఆళ్ల‌గ‌డ్డ‌లో జ‌రుగుతున్న పరిస్థితుల‌న్ని తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల‌ప్రియ‌కు బ‌దులు టీడీపీ త‌ర‌పున నీకు టికెట్ కేటాయిస్తాన‌ని చెప్పార‌ట బాబు. ఇందుకోసం నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయాల‌ని చంద్ర‌బాబు ఏవీకి సూచించార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఈ విష‌యం తెలుసుకున్న మంత్రి అఖిల ప్రియ త‌న‌కు కాకుండా చంద్ర‌బాబు నాయుడు, ఏవీ సుబ్బ‌రెడ్డికి ఎలా టికెట్ కేటాయిస్తార‌ని ఆమె గుర్రుగా ఉన్నారు. దీంతో టీడీపీ అధిష్టానం వీరిద్ద‌రిలో ఎవ‌రికి సీటు కేటాయించినా ప‌రిస్థితి సర్దుమ‌నిగేలా లేదని భావించి వీరిద్ద‌రికి బ‌దులు వేరే వ్య‌క్తిని పోటీ చేయించేందుకు టీడీపీ రెడీ అయింద‌ని తెలుస్తోంది.
 
అందులో భాగంగానే ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, నియోజ‌కవ‌ర్గంలో ఆర్థికంగా రాజ‌కీయ నేత‌ల‌కు వెన్నుద‌న్నుగా ఉన్న శూలం రామ‌కృష్ణ నేరుగా రాజ‌కీయాల్లోకి దిగుతున్నారు. ఈయ‌న బీసీ వ‌ర్గానికి చెందిన నేత కావ‌డంతో దాదాపు టీడీపీ తీర్థ‌మే పుచ్చుకునే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ఆళ్ల‌గ‌డ్డ‌లో పోటీ చేయించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఇదే జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు మంత్రి అఖిల ప్రియ వేరే పార్టీలో చేరుతారా.. లేక మాజీ మంత్రిగానే ఉండిపోతారా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారుతోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.