పుట్టిన రోజున చంద్ర‌బాబు నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 18:34:43

పుట్టిన రోజున చంద్ర‌బాబు నిర్ణ‌యం

న‌వ్యాంధ్రా నిర్మాణంలో చంద్ర‌బాబు అహ‌ర్నిశ‌లు క‌ష్డ‌పడుతున్నార‌ని, దిల్లీని మించిన రాజ‌ధాని అమ‌రావ‌తిలో క‌డ‌తార‌ని కేంద్రం మ‌నకి సాయం చేయ‌డం లేదని, త‌మిళ నాడు త‌ర‌హా రాజ‌కీయాలు మ‌న‌పై చెయ్యాలి అని చూస్తున్నారని తెలుగుదేశం నాయ‌కులు అంటున్నారు.. ఏపీకి ప్ర‌త్యేక హూదా క‌చ్చితంగా రావాలి అని అంటున్నారు సీఎం చంద్ర‌బాబు... మ‌రి గ‌తంలో ప్ర‌త్యేక హూదా అని అడిగితే కేసులు అన్న చంద్ర‌బాబు ఇప్పుడు ఎందుకు యూట‌ర్న్ తీసుకున్నారో తెలియ‌డం లేదు అని ప్ర‌జ‌ల వాద‌న‌.
 
అయితే కేంద్రం పై పోరాడుతున్నాం అంటున్న తెలుగుదేశం ఇప్ప‌టికే ప్ర‌ధాని ఇంటిని ముట్ట‌డించే ప్ర‌యత్నం చేశారు.. ఓరోజు సైకిల్ తొక్కి నిర‌స‌న తెలియ‌చేశారు.. ఇక న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి కేంద్రం పై నిర‌స‌న తెలియ‌చేశారు. ఇక చెవులో పువ్వులు పెట్టుకుని ప్ర‌త్యేక హూదా కోసం నిర‌స‌న తెలియ‌చేశారు.. మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేలు కొర‌డాల‌తో కొట్టుకుని కేంద్రం అన్యాయం చేసింది అని ప్ర‌త్యేక హూదా పై నిర‌స‌న తెలియ‌చేశారు.
 
అయితే ఇవ‌న్ని ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబు కొత్త‌గా నిర్ణ‌యం తీసుకున్నారు..ఓ రోజు స్వయంగా తానే దీక్ష చేయాలని ప్లాన్ చేశారు.... ఇందుకు తన పుట్టినరోజునే ఎంచుకున్నారు... ఏప్రిల్ 20న తిరుపతిలో రోజంతా నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే మున్ముందు మ‌రిన్ని సంచ‌ల‌నాలు నిర్ణ‌యాలు తీసుకుంటాము అని చెప్పారు చంద్ర‌బాబు.. పోరాటం ఉదృతం చేస్తామ‌న్నారు....కేంద్రాన్ని తామే శాసించబోతున్నామని తేల్చి చెప్పారు. పాతిక ఎంపీ సీట్లు గెలిపిస్తే బీజేపీకి తమ స్తతా ఏంటో తెలుస్తుందన్నారు. ఆంధ్రాతో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో త్వరలోనే తెలిసొస్తాయని చంద్రబాబు హెచ్చరించారు.
 
పోలే ఇలాంటి దీక్షలు పర్వాలేదు కాని, చెవిలో పువ్వులు, పెన్ తో పేపర్ల పై అన్యాయం జ‌రిగింది అని రాయ‌డాలు, ప్ల‌కార్డులు ప‌ట్టుకోవ‌డాలు ఇలా కాకుండా కొత్త‌గా ఏం చేసినా ప్ర‌త్యేక హూదా కోసం మంచిదే అంటున్నారు జ‌నాలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.