బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababuu image
Updated:  2018-03-03 10:45:32

బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు కేంద్రంతో స‌యోధ్య‌గానే మెల‌గ‌డానికి రెడీ అయ్యారు.. కేంద్రంతో త‌గ‌వులు వ‌ద్ద‌ని కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తాను అని చెబుతూ, తాజాగా ఓ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు అని స్ప‌ష్ట‌మ‌వుతోంది... ఇప్ప‌టికే తెలుగుదేశం ఎంపీలు కేంద్రంతో పోరాట‌డం నిర‌స‌న తెలియ‌చేస్తాం, ప్ర‌త్యేక హూదా సాధ‌న  కోసం కృషి చేస్తాం అంటూనే తాజాగా కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.
 
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పార్లమెంట్లో ఏ విధంగా ముందుకుపోవాలో తెలియ‌చేశారు అని చెప్పిన ఎంపీలు, మ‌రింత డైల‌మాలో ఉన్నారు...  ఓ పక్క వైసీపీ అవిశ్వాస తీర్మానం అంటోంది, మ‌రో ప‌క్క తెలుగుదేశం ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందా అని బీజేపీ ఎదురుచూస్తోంది.... ఈ స‌మ‌యంలో ఎటువంటి నిర్ణ‌యం తీసుకున్నా తెలుగుదేశానికి బీజేపీకి మ‌ధ్య వార్ న‌డిచే అవ‌కాశం క‌నిపిస్తోంది ఏపీలో.
 
అయితే తాజాగా తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌తో రాజీనామా అనే అస్త్రాన్ని వెన‌క్కి తీసుకున్నారు అని తెలుస్తోంది.. కేంద్రంపై  పార్ల‌మెంట్లో పోరాటం చేయాల‌ని కేవ‌లం అంత వ‌ర‌కూ మాత్ర‌మే మ‌న పోరాటం అనేలా ఎంపీలు చ‌ర్చించుకుంటున్నారు.. ఇటు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచ‌న‌లో లేద‌ని, పెట్టినా వారికి మ‌న మ‌ద్ద‌తు లేదు అని చెప్పార‌ట‌. ఇక మిగిలిన పార్టీల మ‌ద్ద‌తు తీసుకుని వారితో కూడా పార్ల‌మెంట్లో స్తంభింపచేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట బాబు.. దీంతో ఎంపీలు కూడా త‌ల‌లు ఊపి హ‌స్తిన ప‌య‌న‌మ‌వుతున్నారు. అది.... మొత్తానికి అంచ‌నాలు మించేలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు ఏపీ కోసం బాబుగారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.