తెర పై చంద్ర‌బాబు అస‌లు క‌థ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap-cm-nara-chandrababu-naidu
Updated:  2018-02-24 03:03:41

తెర పై చంద్ర‌బాబు అస‌లు క‌థ‌

గ‌త కొద్ది కాలంగా ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ ఎటు చూసినా బ‌యోపిక్ ల హవా కొన‌సాగుతోంది... చిన్న ద‌ర్శ‌కుల నుంచి పెద్ద ద‌ర్శ‌కుల వ‌ర‌కూ ప‌లువురు నేత‌ల జీవితాల‌ను ఆధారంగా చేసుకుని బ‌యోపిక్  సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు.. అయితే ఇప్ప‌టికే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మాజీ ముఖ్య‌మంత్రి, న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా చేసుకుని విల‌క్షణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఓ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు...ఈ చిత్రానికి ల‌క్ష్మీస్ అనే టైటిల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత, నారా చంద్ర‌బాబు జీవిత కథ ఆధారంగా చేసుకుని సినిమాను తీయ‌నున్నారు... ఈ సినిమాకు సంబంధించి !!చంద్రోద‌యం!! పేరుతో టీజ‌ర్ ను శుక్ర‌వారం టీడీపీ రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ రాళ్ల‌ప‌ల్లి సుధారాణి విడుద‌ల చేశారు.. వెంక‌ట‌ర‌మ‌ణ ప‌సుపులేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి అయింద‌ని తెలిపారు..
 
విజ‌య‌వాడ‌లో ఘంటసాల ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాలలో జ‌రిగిన కార్యక్ర‌మంలో సుధారాణి మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు పుర‌స్క‌రించురకుని ఏప్రిల్ 20 చంద్రోద‌యం సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ఆమె తెలిపారు.. శ్వేతార్క గణపతి ఎంటర్‌ ప్రైజెస్‌ పతాకంపై  తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటులు రఘువర్మ, పల్లవి జోష్‌లతోపాటు నాగినీడు ప్రధాన పాత్రలు న‌టించార‌ని తెలిపింది చిత్ర‌యూనిట్..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.