10 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నా బాబు మీటింగ్ కు వెళ్ల‌ను డ్వాక్రామ‌హిళ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-01 15:15:56

10 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నా బాబు మీటింగ్ కు వెళ్ల‌ను డ్వాక్రామ‌హిళ‌

ఈ రోజు ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో డ్వాక్రా మ‌హిళ‌లు ఖ‌చ్చితంగా హాజ‌రు కావాల‌ని సూచించారు అధికారులు. హాజ‌రు కాని ప‌క్షంలో 4 వంద‌ల రూపాయ‌ల‌ను క‌ట్ చేస్తామ‌ని డ్వాక్రా మ‌హిళ‌లకు సంఘాల అధికారులు వారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.
 
వాటికి సంబంధించిన వివ‌రాలు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం..
 
అధికారి- అక్కా
 
డ్వాక్రామ‌హిళ‌-  ఆ చెప్పు అక్కా
 
అధికారి- అక్కా రేపు మీటింగ్ ఉందంట పోవాలంట‌! చంద్ర‌బాబు మీటింగే క‌దా! అనంత మాట్లాడుతుందంట‌... రా.. అక్కా మీటింగ్ కు... 
 
డ్వాక్రామ‌హిళ‌- అక్కా మేము రాము మాగ్రూపులో ఎవ‌రు వ‌చ్చినా తీసుకుని పో.. నేను అయితే రాను.. నాకు ఆ మీటింగ్ కాబ‌ట్ట‌దు.. 
 
అధికారి- నేను చెప్పేది వినూ మీ సంఘం ప‌దిమందిలో ఎవ‌రిని అయినా పంపించు. 
 
డ్వాక్రామ‌హిళ‌- నేను చెప్ప‌ను నువ్వే ర‌మ్మని చెప్పు నేను చెప్పాలా ! వాళ్లు వ‌స్తే తీసుకునిపో నేను రాను.. రావాల‌ని రూల్ పెడితే లీడ‌ర్ల‌ను పొమ్మ‌ని నేను చెప్ప‌ను అక్కా...  నాకు ప‌దిల‌క్ష‌లు ఇస్తామ‌న్న కూడా నేను రాను.. నాకు రాజ‌కీయాలు అవ‌స‌రంలేదు 
 
అధికారి- మీటింగ్ కు సంబంధించిది కాబట్టి ఇది రాజ‌కీయ‌మే. మ‌న డ్వాక్రా మ‌హిళ‌ల‌కు డ్వాక్రావాళ్లే కారు పంపిస్తున్నారు.. 
 
డ్వాక్రామ‌హిళ‌- అయితే నాకు వారి నంబ‌రు ఇవ్వు నేను ప్రెస్ ను పిలిపిస్తాను ఎవ‌రో ర‌మ్మ‌ను.. నాకు రుణ మాఫీ కాలేదు...ఇంకా చాలా ఉన్నాయి.
 
అధికారి- అక్కా నువ్వు వ‌స్తే రా లేకుంటే లేదు త‌ల్లీ.. నీకు నాలుగు వంద‌లు క‌ట్ చేస్తాము.. 
 
డ్వాక్రామ‌హిళ‌- అక్కా నువ్వు 400 క‌ట్ చేయి మాతో క‌రెక్ట్ గా ఉంటె ఉండండి నేను అయితే పోను.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పేది ఏదో చెప్ప‌మ‌ను నేను క్లారిటీ ఇస్తాను.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.