చల్లాకు చంద్ర‌బాబు మ‌రో ఆఫ‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 16:25:05

చల్లాకు చంద్ర‌బాబు మ‌రో ఆఫ‌ర్

ఆర్టీసీ కడప రీజనల్‌ చైర్మన్‌ పదవి మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డికి కేటాయించారు గ‌త వారం సీఎం చంద్ర‌బాబు... అయితే రాయ‌ల‌సీమ‌లో సీనియ‌ర్ అయిన త‌న‌కు ఇటువంటి ప‌ద‌వి ఇచ్చి త‌నను చిన్న‌చూపు చూశారు అని చంద్ర‌బాబు పై చ‌ల్లా ఫైర్ అయిన విష‌యం తెలిసిందే... నేరుగా తాను రాయ‌ల‌సీమ‌లో సీనియ‌ర్ నాయ‌కుడిని అలాంటి నాకు, తెలుగుదేశం అన్యాయం చేసింది అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 
అలాగే ఆయ‌న‌కు ఇచ్చిన ప‌ద‌వి కూడా తాను తీసుకోను అని తెలియ‌చేశారు... తాను ఆ ప‌ద‌వి  చేప‌ట్ట‌ను అని మీడియా ముఖంగా తెలియ‌చేసి తాను మరి కొద్ది రోజుల్లో త‌న భ‌విష్య‌త్ ప్రణాళిక తెలియ‌చేస్తాను అని చెప్పారు.. అయితే  తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు త‌న‌కు పార్టీలో చేరే స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఇస్తాను అన్నారు... ఇంత కాలం వేచి ఉన్నందుకు ఇలాంటి చిన్న ప‌ద‌వి ఇచ్చి త‌న‌ని చిన్న‌చూపు చూశారు అని ఆయ‌న ఆవేద‌న చెందారు.
 
తాజాగా ఆయ‌న‌తో సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడ‌టంతో ఆయ‌న‌కు త్వ‌ర‌లో  సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.... ఈ ప‌ద‌విని రెండు మూడు రోజుల్లోగా అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
ఇక 17 కార్పొరేషన్ల నామినేటెడ్‌ పదవులను భర్తీకి శ్రీకారం చుట్టిన అధికార పార్టీ, ఆయ‌న‌కు ఇచ్చిన ఆర్టీసీ కడప రీజనల్‌ చైర్మన్‌ పదవి త‌న‌కు న‌చ్చ‌లేదు అని చల్లా రామక్రిష్ణారెడ్డికి విమ‌ర్శంచారు మొత్తానికి ఆయ‌న పార్టీ మారితే రాయ‌ల‌సీమ‌లో మ‌రో కుదుపు వ‌స్తుంది అని సీఎం చంద్ర‌బాబు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు ముందుగానే చేశారు అని తెలుస్తోంది... ఇక మ‌రో రెండు రోజుల్లో అధికారికంగా దీనిపై ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.