ఇరుకున పెట్టేశారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-04 14:08:44

ఇరుకున పెట్టేశారు

మొత్తానికి వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదం జ‌రిగితే క‌చ్చితంగా పోటికి తెలుగుదేశం దిగుతుంది అని అంద‌రూ అనుకున్నారు.. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేశారు.తాము పోటికి దిగుతాం అని తెలియ‌చేశారు.క‌ర్నూలు న‌వ‌నిర్మాణ దీక్ష కార్య‌క్ర‌మంలో ఆయ‌న తెలియ‌చేశారు.ఈ నెల 5న వైసీపీ ఎంపీలు స్పీక‌ర్ తో స‌మావేశం కానున్న విష‌యం తెలిసిందే... దీనిపై ఆ నాడు స్ప‌ష్టం వ‌స్తుంది కాబ‌ట్టి  ఆ తుది తీర్పుతో నిర్ణ‌యం ఉంటుంది అని అన్నారు.ఇక రాజీనామాలు ఆమోదించుకుని ఎన్నిక‌ల‌కు సిద్దం కావాలి అని తెలియ‌చేశారు.
 
బీజేపీ, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని ఇలా బీజేపీ పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు ఆయ‌న‌.అయితే తెలుగుదేశం పార్టీ అధినేత వ్యాఖ్య‌లు ఇప్ప‌డు ఆ పార్టీలో ఆలోచ‌న రేపాయి..అధికార పార్టీ ఎంపీ అభ్య‌ర్దులు ఐదుగురు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చేతిలో ఓట‌మిపాల‌య్యారు.
 
ఇప్పుడు ఈ స‌మ‌యంలో మళ్లీ పోటీ అంటే క‌చ్చితంగా ఇది ఆర్దికంగా ఎంతో క‌ష్ట‌మైన అంశం.మ‌రీ ముఖ్యంగా అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి ఆర్దికంగా భ‌రోసా ఉన్నా,ఇప్పుడు వారు ప్ర‌త్యేక హూదా కోసం రాజీనామా చేశారు కాబ‌ట్టి ప్ర‌జ‌లు వారి వైపే చూస్తారు.ఇప్పుడు ఓట‌మి చెంది మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడోసారి వారితో త‌ల‌ప‌డే స‌మ‌స్య వ‌స్తుంది అని వారు భావిస్తున్నారు..
 
రాజీక‌యంగా ఇది వారు ఎదుర్కోవాలి అంటే కాస్త క‌ష్ట‌మైన స‌మ‌స్య అంటున్నారు.ఇక చంద్ర‌బాబు రాజ‌కీయంగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్క‌డ నుంచి కొత్త వ్య‌క్తుల‌ను నిల‌బెడ‌తారు అని కూడా తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డానికి ఆర్దిక బ‌లం ఎంత ముఖ్య‌మో, రాజ‌కీయంగా ప్రజా మ‌ద్ద‌తు ప్ర‌త్యేక హూదా అంశాలు కూడా అలానే ఉంటాయి అని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.