ఆ విష‌యంలో నేను డ్రామాలు ఆడను..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-09-17 12:40:33

ఆ విష‌యంలో నేను డ్రామాలు ఆడను..

2014 తెలుగుదేశం పార్టీ అధికాంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ నాలుగేళ్ల‌ ప‌రిపాల‌న లో రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్య‌క్రమాల‌ను చేప‌ట్టామ‌ని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. కొండ‌వీడు వాగు వ‌ద్ద ఎత్తిపోతల ప‌థ‌కాన్ని ప్రారంభించిని ఆయ‌న ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్ట‌డం ద్వారా రాజ‌ధాని అమ‌రావ‌తి వ‌ర‌ద ముంపు నుంచి కాపాడామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.
 
22 వేల క్యూసెక్కుల వ‌ర‌ద నీరు వ‌చ్చినా ఇబ్బంది లేకుండా కొండ‌వీటి వాగు ఎత్తిపోతల ప‌థ‌కం డిజైన్ చేశామ‌ని అన్నారు. త‌మ‌ అయిదేళ్ల ప‌రిపాల‌న‌లో ఇప్ప‌టికే కృష్ణా, గోదావ‌రి న‌దుల‌ను అనుసందానం చేశామ‌ని, రాబోయే రోజుల్లో కృష్ణా గోదావ‌రి, పెన్నా, నాగావ‌ళి, వంశ‌ధార‌,న‌దుల‌ను అనుసంధానం చేస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఈ న‌దుల‌ను అనుసందానం చేయ‌డం ద్వారా రాష్ట్రానికి నీటికొర‌త లేకుండా చేస్తామ‌ని అన్నారు.
 
అలాగే బీజేపీ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బాబు. బ్యాంకుల‌ను దోచుకున్న వారిని విదేశాల‌కు పంపేసి బాబ్లీ కేసులో త‌న‌పై కేంద్రం ఒత్తిడి తీసుకు వ‌స్తుంద‌ని ఆరోపించారు. బీజేపీ అధ్య‌క్షుడు హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో బాబ్లీ ప్రాజెక్ట్ కు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అంటున్నార‌ని అయితే కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ కాదా, మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ప్ర‌భుత్వం కాదా అని ప్ర‌శ్నించారు. బాబ్లీ విషయంలో తాను డ్రామాలు ఆడాల్సిన అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.