మోడీపై చంద్ర‌బాబు బాంబ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pm modi and chandrababu naidu
Updated:  2018-09-21 11:52:41

మోడీపై చంద్ర‌బాబు బాంబ్

రాజ‌కీయాల్లో త‌న‌కంటే ఎవ‌రు సీనియ‌ర్ నాయ‌కులులేర‌ని నిత్యం ప్ర‌చారం చేసుకునే ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి ఇదే క్ర‌మంలో మ‌రో బాంబ్ పేల్చారు. తాను ప్ర‌ధాని నరేంద్ర‌ మోడీ కంటే రాజకీయంగా సీనియ‌ర్ అని పేర్కొన్నారు. తాను 1995లో  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మొద‌టి సారిగా ముఖ్య‌మంత్రి అయ్యాన‌ని పేర్కొన్నారు. కానీ ప్ర‌ధాని మోడీ 2002లో అంటే సుమారు ఏడు సంవ‌త్స‌రాలు త‌ర్వాత ముఖ్య‌మంత్రి అయ్యార‌ని తెలిపారు. తాజాగా విజ‌య‌వాడ ఇందిరా గాంధీ మున్సిప‌ల్ కృష్ణా స్టేడియంలో ఏర్పాటు చేసిన జ్ఞాన భేరి స‌భ‌లో ఈ వ్యాఖ్య‌లు చేశారు చంద్ర‌బాబు.
 
ఈ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ 2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక భార‌త‌దేశం అభివృద్దిలో వెనుక‌బ‌డింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విప‌రీతంగా, గ్యాస్ పెట్రోల్ ధ‌రలు పెంచార‌ని చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఏపీకి తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పి నాలుగేళ్లుగా పట్టంచుకో కుండా న‌ట్టేట‌ ముంచార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చేయుత‌నిస్తే గుజ‌రాత్ కంటే ఎక్కువ చేయుత‌నిస్తుంద‌నే ఉద్దేశంతో ఏదో ఒక భావ‌న మ‌న‌స్సులో పెట్టుకుని నిధుల‌ను కేటాయించ‌కున్నార‌ని చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. త‌ర్వ‌లో అమ‌రావ‌తిని ప్ర‌పంచ దేశాలు గ‌ర్వించ‌ద‌గ్గ రాజ‌ధానిగా నిర్మిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.