చంద్ర‌బాబు అస‌లు రంగు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 16:49:26

చంద్ర‌బాబు అస‌లు రంగు

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని స్వ‌ల్ప మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సుమారు నాలుగు సంవ‌త్స‌రాలు పాటు బీజేపీతో చంద్ర‌బాబు మిత్ర‌ప‌క్షంగానే ఉన్నారు.అయితే అమాంతంగా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్  విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌ను రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నూరిపోశారో అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు అల‌ర్ట్ అయి బీజేపీ మిత్ర‌ప‌క్షానికి గుడ్ బై చెప్పి కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
గ‌తంలో చంద్ర‌బాబు బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న స‌మ‌యంలో 2016 నవంబర్‌ 8న నోట్ల రద్దును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగుడుతూ 500, రూ. 1000 నోట్లను రద్దు వ‌ల్ల దేశంలో అవినీతిని రూపుమాప‌వ‌చ్చ‌ని అందుకు తాను మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని చంద్ర‌బాబు త‌న సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఇప్పుడు కేంద్రంతో క‌టీఫ్ చెప్ప‌డంతో మోడీని తీవ్ర స్థాయిలో చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మ‌హానాడు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మ‌రోసారి మోడీని ఉద్దేశించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. 
 
నోట్ల రద్దు వల్ల దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అందుకు మోదీనే కారణమని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ, పనులు తక్కువ. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే,వారి పథకాలతో బాగుపడ్డ వాళ్లు ఎవరూ లేరు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ వ్వవస్థను నిర్వీర్యం చేశారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడింది.. అంటూ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక ఇదే అంశాన్ని చంద్ర‌బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా కూడా తెలియచేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.