బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-28 01:14:08

బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు త‌న రాజ‌కీయ అరంగేట్రం జ‌రిగి  40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో, ఆయ‌న అనుకూల మీడియా చంద్ర‌బాబును ఇంట‌ర్వ్యూ చేసింది... ఈ ఇంట‌ర్వ్యూలో ముఖ్య‌మంత్రి ప‌లు ఆస‌క్తిక‌ర‌మై వ్యాఖ్య‌లు చేశారు... ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై  రాష్ట్ర వ్యాప్తంగా !!అవునా!!అన్న కోణంలో ఆలోచిస్తున్నారు ప్ర‌జ‌లు... కాగా ఇప్ప‌టికే  దేశం ఇంత‌లా అభివృద్ది చెందుతుందంటే తానే కార‌ణ‌మ‌ని, అలాగే ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడ‌కం పెరిగింద‌టే తానే కార‌ణ‌మ‌ని చెప్పుకుంటూ బాబు స్పీచ్ లో త‌న‌ను  తానే పోగుడుకుంటున్న సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే.
 
అయితే తాజాగా అలాంటి ప్ర‌స్తావనే మ‌రోసారి వెలుగు చూసింది...చంద్ర‌బాబు ఆస్థాన మీడియాతో మ‌ట్లాడుతూ.... గతంలో త‌న‌కు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఉన్న సంబంధంపై స్పందించారు..  అప్ప‌ట్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున పోటీ చేసేందుకు తానే స్వ‌యంగా ఇందీరా గాంధీతో మాట్లాడి సీటు ఇప్పించాన‌ని తెలిపారు చంద్ర‌బాబు... అయితే వైఎస్ కు త‌న‌కు వ్య‌క్తి గ‌తంగా ఎలాంటి విభేదాలు లేవ‌ని, పార్టీకోసం ఒక‌రికొక‌రు క‌లిసి మెలిసి క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వార‌మ‌ని చంద్రబాబు అన్నారు..   తాను తెలుగు దేశం పార్టీలోకి వెళ్లిన త‌ర్వాత  పార్టీ అభివృద్ది కోసం అనేక సార్లు ఫైట్ చేశాన‌ని తెలిపారు చంద్ర‌బాబు.
 
అయితే ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చించుకుంటున్నారు ప్ర‌జ‌లు... ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అదేదో రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ్ర‌తికి ఉన్న‌ప్పుడే ఈ విష‌యాల‌ను చెప్పొచ్చు క‌దా! ఆయ‌న లేన‌ప్పుడు ఇలాంటి మాట‌లు మాట్లాడితే ఎవ‌రు న‌మ్ముతార‌ని ప‌లు చోట్ల జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.. త‌న హ‌యాంలో !!అది జ‌రిగింది ఇది జ‌రిగిందని!! చెప్పుకుంటూ ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని భావిస్తున్నారు ప్ర‌జ‌లు.. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది.. ఆ స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రెడ్డి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తే ,ఇటు చంద్ర‌బాబు ఇందిరా కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేశారు.. ఈ లెక్క‌న ఎంత అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.