జ‌గ‌న్ ఏం చెబితే అదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-02 17:49:44

జ‌గ‌న్ ఏం చెబితే అదే

ఏపీలో బీజేపీ తెలుగుదేశం దోస్తీకి క‌టీఫ్ చెప్ప‌డంతో ఇప్పుడు తెలుగుదేశం- బీజేపీ మాటల వార్ కు దిగుతున్నాయి..తెలుగుదేశం నాయ‌కుల చ‌ర్య‌లు స‌ర్కారు త‌ప్పుల‌ను ప్ర‌శ్నించే బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ  శాస‌న‌స‌భాప‌క్ష‌నేత విష్ణుకుమార్ రాజు మ‌రోసారి తెలుగుదేశం స‌ర్కారుపై ఫైర్ అయ్యారు..
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయిందని.. వైసీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ పతనం ఖాయమని స్పష్టం చేశారు. ఇది జ‌ర‌గ‌డం ఖాయం అనేలా ఆయ‌న వ్యాఖ్యానించారు.
 
వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి  ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పార్టీతో ఎలాంటి అవగాహనలేదని విష్ణుకుమార్‌రాజు తెలిపారు.... అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని చెప్పారు. చంద్రబాబు చేస్తున్నది అధర్మ పోరాటమని విమర్శించారు ఆయ‌న‌... ఇక  పట్టిసీమపై 15 రోజుల్లో సీబీఐ విచారణ కోరతామని, పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అవినీతికి పాల్పడిన వారికి శిక్షపడుతుందని ఆయన అన్నారు.. కుట్ర‌పూరిత రాజ‌కీయాలు సాగ‌వు అని ఆయ‌న మండిప‌డ్డారు.
 
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని విష్ణుకుమార్‌రాజు ధీమా వ్యక్తం చేశారు... ఏపీలో ప్ర‌జ‌లంద‌రికి తెలుగుదేశం చేస్తున్న రాజ‌కీయాలు ప‌రిపాల‌న తెలిసిపోయింది అని ఆయ‌న విమ‌ర్శించారు..జ‌గ‌న్ ఏమి చెబితే అదే చంద్ర‌బాబు నాయుడు ఫాలో అవుతున్నారు అని ఆయ‌న ఎద్దెవా చేశారు... తెలుగుదేశం నాయ‌కుల పై ప్ర‌జ‌ల్లో మ‌రింత వ్య‌తిరేక‌త వ‌చ్చింది అని ఆయ‌న అన్నారు.
 
ఇక కేంద్రం పై బీజేపీ పై విమ‌ర్శ‌లు ఆపాల‌ని కేంద్రం ఏమి ఇచ్చిందో ఏమి చేసిందో తెలుగు ప్ర‌జల‌కు తెలియ‌చేయాల‌ని ఆయ‌న తెలిపారు.. మొత్తానికి రాజుగారి మాట‌లు వింటుంటే రాష్ట్ర రాజ‌కీయాల్లో ఏదో జ‌రుగ‌బోతోంది అని తెలుస్తోంది అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.