టూర్ నెంబ‌ర్ 30 స్టే నంబ‌ర్ 18

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-03 18:45:44

టూర్ నెంబ‌ర్ 30 స్టే నంబ‌ర్ 18

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దిల్లీలో బిజి బిజీగా 48 గంట‌ల టూర్ ప్లాన్ చేశారు.. అలాగే ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధించేందుకు కేంద్రంపై నిప్పులు చెరిగేందుకు రెడీ అయ్యారు... ఇప్ప‌టికే పార్ల‌మెంట్ లో నాయ‌కుల‌కు క‌లిసి ఏపీకి జ‌రిగిన అన్యాయం పై ప‌త్రాలు పుస్త‌కాలు పంపిణీ చేయ‌నున్నారు... వ‌చ్చే ఎన్నికల్లో మోదీని బీజేపీని ఎన్డీఏని న‌మ్మ‌కూడ‌ద‌ని న‌మ్మి మేము మోస‌పోయామ‌ని తెలియ‌చేయ‌నున్నారు.
 
అయితే ఇక మూడే మూడు రోజులు పార్లమెంట్ సెష‌న్స్ ముగియ‌నున్నాయి, ఇక స‌భ నిర‌వ‌ధిక వాయిదా త‌ర్వాత దిల్లీలో ఈ గ‌ల్లీ రాజ‌కీయం ప‌నిచేయ‌ద‌ని అంద‌రికి తెలిసిందే... అయితే ఇప్పుడు ఇంత హఠాత్తుగా హ‌స్తిన బాట ఎందుకు ప‌ట్టారు అంటే అంద‌రూ ఎంపీలు నాయ‌కులు పార్టీ అధ్య‌క్షులు దొరికే స‌మ‌యం ఇదే, లేక‌పోతే మ‌ర‌లా వ‌ర్షాకాల స‌మావేశాల‌కే వారి ద‌ర్శ‌నం క‌లుగుతుంది.
 
ఇది బాబుగారి ఐడియా.. అయితే జ‌గ‌న్ ఇక్క‌డ త‌మ ఎంపీలు రాజీనామా చేసి మ‌న ఆస్తి అయిన ఏపీ భ‌వన్ లో ఆమర‌ణ నిరాహార దీక్ష చేస్తారు అని చెప్పి రెండు  రోజులు దాటి పోయింది.. దీనిపై చంద్ర‌బాబు మాట్లాడ‌రు మాట్లాడితే మళ్లీ జ‌గ‌న్ ఏమంటాడో అని, ఏకంగా జ‌గ‌న్ వ‌చ్చి కూర్చున్నా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు... అందుకే దాని గురించి అప్ర‌స్తుతం  అని ఆయ‌న వాద‌న.. మ‌రి తెలుగుదేశం ఎంపీలు ఆమ‌ర‌ణ కాదు క‌దా దీక్ష‌కు కూడా కూర్చోరు అనేది ఇంట‌ర్న‌ల్ టాక్..
 
అయితే ఈ భేటీలో  బీజేపీ నాయ‌కుల‌తో మ‌ళ్లీ బాబు గారు భేటీ అయితే అది లాబీయింగ్ అంశం అవుతుంది... దేశంలో క‌ల్లోలం సృష్టిస్తుంది... అందుకే వారు కూడా కాస్త సీక్రెట్ గానే రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుస్తున్నారు.. అయితే టూర్ నెంబ‌ర్ 30 స‌క్సెస్ అవ్వాలి అని ఇక్క‌డ త‌మ్ముళ్లు అలాగే ఆస్దాన‌మీడియా రెడీ అవుతోంది... ఏకంగా హ‌స్తిన మేడ‌లు కోట‌లు బీట‌లు వాలాయి అని అంటున్నాయి కొన్ని భ‌జ‌న మీడియాలు.. అయితే మోదీని భ‌య‌పెట్టాలి అని అనుకుంటున్నార‌ట, అందుకే పార్టీ నాయ‌కుల‌కు బాబుకు కాస్త తెలిసిన ఇతర పార్టీల నాయ‌కుల‌కు, ఎంపీల‌కు పార్టీల అధ్య‌క్షుల‌కు  తెలుగుదేశం విందు ఇవ్వ‌నున్నార‌ట బాబు. 
 
ఇక్క‌డ ఒక‌వేళ బాబు  న్యాయ‌మూర్తుల‌ను క‌లిస్తే దాని త‌ర్వాత ఎటువంటి పొలిటిక‌ల్ డైమెష‌న్స్ జ‌రుగుతాయి.. రాజ‌కీయ నాయ‌కుల‌కు క‌లిస్తే ఒకే , న్యాయ‌మూర్తుల‌ను క‌లిస్తే స్టేల సంఖ్య పై , ఆ కేసుల పై ఓ వార్త వెలువ‌డ‌టానికి సూచ‌న అని అనుకోవాలా అనే వార్త‌లు వ‌స్తున్నాయి ఏపీలో.. అయితే ముందు వైసీపీ ఎంపీలు ఆమ‌ర‌ణ దీక్ష అన్నారు మ‌రి తెలుగుదేశం ఎంపీలు ఏం చేస్తారో చూద్దాం అని ప్ర‌జ‌లు చూస్తున్నారు...
 
చూద్దాం ఏ నంబ‌ర్ పెరుగుతుందో ఏ నంబ‌ర్ త‌గ్గుతుందో స్టేనా?టూరా?

షేర్ :

Comments

2 Comment

  1. ВСЕГО ОДНА КАПСУЛА В ДЕНЬ и ты будешь заниматься сексом ежедневно по 2-3 часа! В любо

    Танкат - Мощный активатор потенции, созданный с учетом российских реалий ОфициаÐ

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.