వైసీపీలోకి ఫిక్స్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-01 15:51:45

వైసీపీలోకి ఫిక్స్ ?

గుంటూరు జిల్లా నుంచి కృష్ణాజిల్లా వ‌ర‌కూ వైసీపీలోకి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ నుంచి  చేరిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.. జ‌గ‌న్ కోస్తాలో పాద‌యాత్ర మొద‌లుపెట్టేస‌రికి తెలుగుదేశం బీట‌లు వాలుతున్నాయి.ఇప్ప‌టికే కాట‌సాని కూడా పాణ్యం నుంచి త‌న అనుచ‌రులు కేడ‌ర్ తో వ‌చ్చి పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.. ఇక జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు, ముఖ్యంగా వైసీపీ కేడ‌ర్ కూడా జ‌గ‌న్ కు వెన్నంటి ఉంటోంది కృష్ణా జిల్లాలో.
 
ఇక ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి,అలాగే కాట‌సాని వైసీపీ గూటికి చేరారు.. అలాగే మాజీ మంత్రిక‌న్నా కూడా ఈ వారంలో వైసీపీలో  చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.. ఇక మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్ కూడా వైసీపీలో చేరేందుకు ముహూర్తం రెడీ చేసుకున్నారు... గ‌త వారం వైసీపీలో ఆయ‌న ఎంట్రీ ఉంటుంది అని వార్త‌లు వినిపించాయి... అయితే ఆయ‌న‌తో నేరుగా సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు, పార్టీ మార‌వ‌ద్ద‌ని తెలియ‌చేశారట‌.
 
ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు కృష్ణ‌ప్ర‌సాద్, ముఖ్య‌మంత్రి పిలిచి మాట్లాడారని వచ్చే ఎన్నికల్లో గుంటూరులో అవకాశం ఇస్తామని చెప్పారన్నారు... జిల్లా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవటం ఇష్టం లేదని స్పష్టం చేశారు ఆయ‌న.... టీడీపీ కంటే ఎక్కువగా కాంగ్రెస్‌, వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు..... త్వరలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేర‌నున్న‌ట్లు కృష్ణ‌ప్ర‌సాద్ తెలియ‌చేశారు.
 
జగన్‌, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలతో సాన్నిహిత్యం ఉందని వైసీపీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాని చెప్పారు... ఆలోచన మార్చుకునే ప్రసక్తే లేదన్నారు. 1998 నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎలాంటి పదవులు తీసుకోలేదన్నారు. ప్రజల నుంచి ఎన్నిక కావాలన్నది ఆశయ మన్నారు. టిక్కెట్‌ రాకపోయినా జగన్‌ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.