చంద్ర‌బాబు ఆ జిల్లాపై క‌క్ష సాధింపు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-09-28 03:19:37

చంద్ర‌బాబు ఆ జిల్లాపై క‌క్ష సాధింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత తొలి స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని 2014లో క‌ర్నూల్ జిల్లాలోనే ఘ‌నంగా నిర్వ‌హించారు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఎన్నో హామీలు ఇచ్చారు ఈ జిల్లాకు. వాటిలో కీల‌క‌మైన‌ది జిల్లాను పారిశ్రామిక హ‌బ్ గా మారుస్తామ‌న్న‌ది. 
 
అయితే ఈ జిల్లాలో 30 నుంచి 35 వేల ఎక‌రాలు ప్ర‌భుత్వ భూమి అందుబాటులో ఉన్నా ఆ దిష‌గా ప్ర‌భుత్వ ఒక్క అడుగు కూడా పారిశ్రామిక వైపు ముందుకు వెయ్య‌లేదు. అంతేకాదు చంద్ర‌బాబు హామీల్లో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి కూడా ఆచ‌ర‌ణ‌లోకి రాలేదు. అలాగే జిల్లాలో ఏయిర్ పోర్ట్ నిర్మానం కూడా ఇంకా ప్ర‌థ‌మిక ద‌శ‌లోనే ఉంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నంద్యాల‌ను విత్త‌న స్థాయి కేంద్రంగా మారుస్తామ‌న్న‌హామీ కూడా ముందుకు వెళ్ల‌లేదు. అటు చేనేత వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉండే ఎమ్మిగ‌నూరులో టెక్ట్ టైల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన హామీ ఏడాది క్రితం వేసిన ఫౌండేష‌న్ ద‌గ్గ‌రే ఆగిపోయింది.
 
 అంతేకాదు డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో మైనింగ్ కాలేజ్ హామీ కూడ అతిగ‌తి లేకుండా పోయింది. ఈ జిల్లాకు చంద్ర‌బాబు ఉర్దూ యూనివ‌ర్శిటి హామీ ఇచ్చారు. జిల్లాలో పూర్తి స్థాయి భ‌వ‌నాలు లేక‌పోయినా యూనివ‌ర్శిటి మాత్రం ప్రారంభం అయింది. ట్రిబుల్ ఐటీకి అనుమ‌తి వ‌చ్చినా ఇందుకు సంబంధించిన మౌలిక స‌దుపాయాలు మాత్రం స‌మ‌కూర్చ‌లేదు. దీంలో టీడీపీ హాయాలంలో క‌ర్నూల్ జిల్లా ప‌రిస్థితి అట‌కెక్కింద‌ని జిల్లా వాసులు వాపోతున్నారు. 
 
అలాగే క‌రువు నివార‌ణ సంబంధించిన చ‌ర్య‌లు కూడా పూర్తి చేస్తామ‌న్న హామీ కూడా అమలు కాలేదు. ఈ జిల్లా హంద్రీనివా కింద 80 వేల ఎక‌రాలు సాగు కావాలి కానీ కాలువ నిర్మానం పూర్తి కాక‌పోవ‌డంతో ఒక్క ఎక‌రాకు కూడా సాగునీరు అంద‌డంలేదు. హంద్రీనివ న‌దితో 106 చెరువ‌లును నింపుతామ‌న్న హామీ సంబంధించిన ఫైల్ టేబుల్ల‌పైనే తిరుగుతున్నా కానీ ఒక్క చెరువుకూడా నిండించిలేదు. దీంతో రైతులు మండిప‌డుతున్నారు. చంద్ర‌బాబు నాయుడు ఎందుకు త‌మ‌పై క‌క్ష‌సాదిస్తున్నారో అర్థం కాకుంద‌ని జిల్లావాసులు వాపోతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.