కుటుంబాల‌ని కూడా వాడేస్తున్న చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 16:08:46

కుటుంబాల‌ని కూడా వాడేస్తున్న చంద్ర‌బాబు

ప్ర‌భుత్వ ఉద్యోగం వార‌స‌త్వంగా రాదు, రాచ‌రికం రోజులు క‌నుమ‌రుగు అయ్యాయి.. ఇప్పుడు మాత్రం పొలిటిక‌ల్ జ‌ర్నీలు మాత్రం త‌మ వార‌సుల‌కు అప్ప‌చెప్పి రాజ‌కీయాల్లో రెస్ట్ తీసుకుంటున్నారు సీనియ‌ర్లు.. త‌ర త‌ర‌త‌రాలు సెట్ అయ్యేలా నిల‌బ‌డిపోతున్నారు ప‌లువురు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు.. ముఖ్యంగా రాజ‌కీయాల్లో సీనియ‌ర్ మంత్రి ఎమ్మెల్యే అయితే చాలు త‌ర్వాత త‌న  వార‌సుల‌ను రాజ‌కీయంగా దింపాలి అని ఆలోచిస్తారు.. అందుకే చిన్నత‌నం నుంచే వార‌సుల‌ను రాజ‌కీయాల్లో యాక్టీవ్ గా ఉంచుతారు..
 
ఇక సీఎం చంద్ర‌బాబు కూడా గ‌తంలో త‌న కుమారుడు నారాలోకేష్ ను కూడా కుప్పం పంపించి ప్ర‌జా సేవ‌చేయించే వారు,  గ‌తంలో మంత్రి లోకేష్ ఇదే విష‌యం చెప్పారు.. అదీ  తెలిసిందే అయితే 2014 ఎన్నిక‌ల్లో ఎలాగో అలాగ గెలిచాం అనేది ఇప్ప‌టికీ టీడీపీ ఆలోచ‌న మోదీ ప‌వ‌న్ ధ్వ‌యం టీడీపీకి బాగా క‌లిసి వ‌చ్చింది....2009 ఎన్నికల్లో స్టార్ కాంపైనర్గా టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన విష‌యం తెలిసిందే. తన వాళ్లకు కూడా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. 
 
అయితే త‌ర్వాత ఎన్టీఆర్ ను కూర‌లో క‌రివేపాకులా పార్టీలో వాడుకుని వ‌దిలేశారు చంద్ర‌బాబు అనే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. ఇటు హ‌రికృష్ణ‌కు కూడా నామ‌మాత్రంగా రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇచ్చి, ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి ఆయ‌న్ని కూడా త‌ప్పించారు.. కేవ‌లం పొలిటి్ బ్యూర్ సభ్యుడిగా కుటుంబస‌భ్యుల త‌ర‌పున ఆయ‌న ఉన్నారు అంతే.
 
ఇప్పుడు మ‌ళ్లీ బాబు ఫ్యామిలీ రాజ‌కీయాలు తెర‌పైకి తీసుకువ‌చ్చారా అంటే అవున‌నే అనిపిస్తోంద‌ట కొంద‌రికి.. ఇటు ఎలాగో త‌న‌యుడు మంత్రి ప‌ద‌వితో రాజ‌కీయాల్లో ఉన్నారు, భావి సీఎం అంటూ అప్పుడే సీఎం చంద్ర‌బాబు  త‌ర్వాత మా నాయ‌కుడు లోకేష్  అంటూ అంద‌రూ లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు.
 
ఇక కోడ‌లు బ్రాహ్మ‌ణికి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యవాడ ఎంపీ టికెట్ ఇస్తారు అని వార్తలు వినిపించాయి.. ల‌గ‌డ‌పాటికి కూడా ఎంపీ సీటు అందుకే నో చెప్పారు అని ఇటీవ‌ల క్లారిటీ వ‌చ్చింది, ఇటు చివ‌రి నిమిషంలో బ్రాహ్మ‌ణి విజ‌యవాడ ఎంపీగా నిల‌బ‌డ‌తారు అని తెలుస్తోంది.
 
ఇక ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు కూడా తెలుగుదేశం త‌ర‌పున మంత్రి పుల్లారావు సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంది.. ఆయ‌న‌కు ఇప్పుడు టికెట్ పై హామీ ఇచ్చినా ఆ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం లేదు, చివ‌రి నిమిషంలో స‌ర్వే పేరుతో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది.
 
ఇక చంద్ర‌బాబు సోద‌రుడు రామ్మూర్తి నాయుడుకు కూడా ఏదో ఓ చోట నుంచి రాజ‌కీయంగా ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ట, అలాగే  జిల్లాలో ఓ సెగ్మెంట్ నుంచి ఆ కుటుంబం సీటు కూడా కోరుతోంద‌ట‌. అలాగే  ఇప్పుడు బాల‌య్య చిన్న అల్లుడు భ‌రత్ కు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వాలి అని తెలుగుదేశం భావిస్తోంద‌ట‌.. ఇటు వైసీపీ త‌ర‌పున ఇంకా అభ్య‌ర్దులు ప‌రిశీల‌న‌లో ఉన్నారు.
 
అలాగే బీజేపీ త‌ర‌పున హ‌రిబాబు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ త‌ర‌పున టి ఎస్సార్ ఉంటారు.. అయితే తెలుగుదేశం త‌ర‌పున గీతం అధినేత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మ‌నువ‌డు బాలయ్య చిన్న అల్లుడు అయిన భ‌ర‌త్ కు ఇస్తే ఇక్క‌డ విజ‌యం త‌థ్యం అని అనుకుంటున్నారు ఇరు కుటుంబ స‌భ్యులు.. అయితే ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా ఎప్ప‌టి నుంచో కోరిక ఉన్న సీటు కాబ‌ట్టి , ఎమ్మెల్సీ నుంచి త‌ప్పుకుని ఎంవీవీఎస్ మూర్తి అయినా పోటీ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.. ఆర్దికంగా బ‌ల‌వంతులు కాబ‌ట్టి చంద్ర‌బాబు కూడా మొగ్గుచూపుతున్నారు.
 
ఇక మొత్తానికి వ‌చ్చే ఎన్నికల్లో గెలుపుకోసం కుటుంబ రాజ‌కీయాల‌కు కూడా బాబు తెర‌లేపారు అని అంటున్నారు మ‌రి జ‌గ‌న్ ఎటువంటి స్ట్రాట‌జీ వాడ‌తారో చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.