ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-10-13 14:52:40

ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు...

ఆపరేషన్ గరుడ భాగంలోనే సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్ ఆగ్రహించారు.. అది ఆంధ్రులపై దాడి చేయడమే అని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో పాటు ఎన్నికలో ఇచ్చిన 18 విభజన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము డిమాండ్ చేశామని లోకేష్ స్పష్టం చేశారు.. ఆంధ్రుల హక్కులను కోరినందుకే ప్రధాని మోడీ తమపై కక్ష కట్టారని విమర్శించారు..

సీఎం రమేష్ ఆయన బంధువుల ఇల్లు కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన నేపథ్యంలో ట్విట్టర్ లో స్పందించారు.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా విషయంలో వెనక్కి వెళ్ళేది లేదని లోకేష్ పేర్కొన్నారు.  అటు తండ్రి చంద్రబాబు కూడా ఇదే విధంగా గగ్గోలు పెడుతున్నారు.. ఈ ఐటీ దాడులపైనా ఎందుకింత గగ్గోలు పెడుతున్నారో అర్థం కావట్లేదు.. ప్రజల్లో ఎవరిపైనైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేసినా, సోదాలు చేసినా ఇలాగే స్పందిస్తారా..? అంటే కాదు.. చూస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు, వారి మొత్తం మంత్రిమండలికి వాళ్ళ ఆస్తుల్ని సంస్థలని కాపాడు కో వటానికే అధికారంలోకి వచ్చినట్లుంది.

అలాగే వేరెవరికి పనులు దొరక్కుండా మొత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ తమ తమ కుటుంబాలకే దక్కాలని, వెరెవరికీ ఆ ప్రయోజనాలు సిద్ధించగూడదన్నట్లుంది వీరి మాటలు చేతలు చూస్తుంటే. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికి సమాన హక్కులు భాధ్యతలు విధానాలు ఉన్నందున వాటిని పాలించాల్సిన అవసరం అందరికి సమానంగా ఉంది కదా! ఒక వేళ ప్రధాని నరేంద్ర మోడీ