పవన్ తో జగన్ లాభం.. చంద్రబాబు కు ముచ్చెమటలు.. ఎలాగంటే.

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan and pawan kalyan
Updated:  2018-10-10 02:26:03

పవన్ తో జగన్ లాభం.. చంద్రబాబు కు ముచ్చెమటలు.. ఎలాగంటే.

పవన్ కళ్యాణ్ ఇటీవలే ఓ మీటింగ్ లో తనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా బద్ధశుత్రువు కాదని అన్నారు. ఈ మాటల వెనుక అర్థాలేమిటనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవగా, గతంలో పవన్ కళ్యాణ్ 2014 లో టీడీపీ తరుపున పోటీ చేసి చంద్ర బాబు ను సీఎం కుర్చీ లో కూర్చోబెట్టినాడు అయితే తరువాత పరిస్థితులు మారి టీడీపీ కు పవన్ బద్ద శత్రువుగా మారి పోయాడు.

ఇదిలా ఉంటె ఎన్నికల్లో పవన్‌-జగన్‌ కలుస్తారని మొదట్లో వార్తలొచ్చాయి. ఎందుకో తెలియదుగానీ ఆ దశలో పవన్‌పై జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జనసేనాని కూడా ఇదే స్థాయిలో స్పందించారు. ఇద్దరి మధ్య పొత్తు వుండదనే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికే అలా మాట్లాడుకున్నారన్న చర్చ జరిగింది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ తనకు టిడిపి, వైసిపి సమాన దూరమేనని వ్యాఖ్యానించారు. తాజాగా వైసిపి తనకు బద్ధ శత్రువేమీ కాదనే వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఎవరికీ పూర్తిస్థాయి మెజారిటీ రాకుంటే. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈసారి జనసేన సహకారం లేకుండా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని పవన్‌ చెబుతూ వస్తున్నారు. ఇటువంటి సంకీర్ణం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులే వస్తే. టిడిపికి మద్దతు ఇచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే. గత ఎన్నికల్లో పవన్‌ మద్దతు తీసుకున్న టిడిపి. ఆయన కాస్త ఎదురుతిరిగేసరికి బద్ధ శత్రువులా చూస్తోంది. పవన్‌ దాడి కూడా తెలుగుదేశం పైనే ప్రధానంగా ఉంది. అందుకే టిడిపిని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే పనిని పవన్‌ చేయకపోవచ్చు. ఇక మిగిలింది వైసిపి మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్‌ తాజా వ్యాఖ్యలను చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.