చంద్రబాబు భయపడుతున్నారా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 15:24:36

చంద్రబాబు భయపడుతున్నారా?

మోడీని చూసి చంద్రబాబు భయపడుతున్నారా..? అందుకే అనుకూల మీడియాలో ఒక మాట, నేషనల్ మీడియాలో ఒక మాట చెప్తున్నారా? బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత కూడా మోడీపై ఎందుకు విమర్శలు చేయడం లేదు? ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పాను అని చెప్పుకునే బాబు, ఇప్పుడు అదే కేంద్రాన్ని చూసి భయపడుతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
 
ఓటుకు నోటు కోసం ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టి, ప్యాకేజీకి జై కొట్టి, సుమారు నాలుగు సంవత్సరాలు కాపురం చేశారు చంద్రబాబు.. ప్రతిపక్ష నేత పోరాట పటిమతో ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో ప్రత్యేక హోదా పేరు ఎత్తకపోతే రాష్ట్రంలో టీడీపీకి మనుగడ ఉండద‌ని భావించి చంద్రబాబు యూ- టర్న్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు... అందులో భాగంగానే బీజేపీకి విడాకులు ఇచ్చారని, మంత్రి పదవులకు రాజీనామాలు  చేపించారని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు...
 
బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి బీజేపీపై విమర్శల ఘాటును పెంచారు టీడీపీ నాయకులు...కానీ చంద్రబాబు మాత్రం విమర్శలు చేయడానికి వెనకడుగువేస్తూ వచ్చారు... చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక మాట, ఏపీలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పడంతో, ఓటుకు నోటు కోసం మోడీకి చంద్రబాబు భయపడుతున్నారని అనుకున్నారు..
 
ఇప్పుడు అదే నిజం అయింది.. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబుని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తెల్లముఖం వేసుకున్నారు... 
 
విలేకరి : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుచేస్తారా? 
 
చంద్రబాబు : ఇప్పుడు కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం ముఖ్యం 
 
విలేకరి : వచ్చే ఎన్నికల్లో టీడీపీ - కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తుందా? 
 
చంద్రబాబు : నేను కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వచ్చా..ఇప్పుడు ఆ అంశం మాట్లాడాల్సిన సమయం కాదు... .
 
విలేకరి : మోదీ వ్యతిరేక ఫ్రంట్‌ ఉంటుందా? అని మరొకరు ప్రశ్నించగా, 
 
చంద్రబాబు : సూటిగా సమాధానం చెప్పకుండా ప్రాంతీయ పార్టీల బలోపేతానికి కృషి చేస్తాం...
 
విలేకరి : మీరు మూడో కూటమిలోకి వస్తారా? జాతీయ రాజకీయాల్లో మీ విధానమేంటి?
 
చంద్రబాబు : సమాధానం చెప్పకుండా తెల్లముఖం వేసుకున్నారు... 
 
విలేకరి : ఇక బీజేపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారా? అని అడగ్గా 
 
చంద్రబాబు : సమాధానం చెప్పకుండా చూస్తూ ఉన్నారు...
 
ఇది చూసిన ప్రజలు చంద్రబాబు కేంద్రానికి, నరేంద్ర మోడీకి భయపడుతున్నారని అనుకుంటున్నారు..ఓటుకు నోటు కేసే కాకుండా, రాష్ట్రంలో అవినీతి బాగా జరిగిందని కేంద్రం దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి..తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై కూడా కేంద్రం ఆరా తీస్తున్నట్లు సమాచారం...దీంతో ఏం మాట్లాడిన ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని భావించి చంద్రబాబు ఏమి మాట్లాడకుండా ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.