జగన్ సభలకు అంత ఆదరణ ఏంటి.. తల పట్టుకుంటున్న చంద్రబాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan meeting
Updated:  2018-10-12 03:07:27

జగన్ సభలకు అంత ఆదరణ ఏంటి.. తల పట్టుకుంటున్న చంద్రబాబు

జగన్ పాదయాత్రకు వస్తున్న జనాలను చూస్తుంటే బాబు కు భయం వేయడం లేదంటే అది అబద్దమే అవుతుంది. జగన్ సభలకు జనాలు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నేతకు ఇంతలా జనం రావడం లేదంటే అతిశయోక్తి కాదు.
 
మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు, జగన్ సభలకు జనాల రాక పట్ల అసహనం విస్మయం చెంది నట్టు టాక్ ఉత్తరాంధ్రలోకి జగన్ పాదయాత్ర మొదలైన నాటి నుంచి కెమేరా లెన్స్ లకు అందనట్లుగా ప్రజాభిమానం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వైనం టీడీపీ తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. తాజాగా జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లా గజపతి నగరంలో సాగుతోంది.
 
ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చిన అశేష జనసందోహం కెమేరా లెన్స్ లకు ఓ పట్టాన పట్టని పరిస్థితి. ఇసుక వేస్తే రాలనట్లుగా మారిన ఈ జనజాతర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత కష్టానికి ప్రతిఫలంగా చెప్పక తప్పదు. తామెంతగా ప్రచారం చేస్తున్నా.. జగన్ సభలకు అంతకంతకూ పెరుగుతున్న ఆదరణ టీడీపీ నేతలకు ఒక పట్టాన అర్థం కావట్లేదు.
 
తాజాగా.. ఈ ఫోటోను చూస్తున్న తెలుగు తమ్ముళ్లకు భోజనం చేసేందుకు సైతం ఇష్టపడటం లేదని చెబుతున్నారు. పదేళ్ల విరామం తర్వాత ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని నిలుపుకోవటంలో అడ్డంగా ఫెయిల్ కావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.తమ తోపు బాబు ఏదో చేస్తాడని తామనుకున్నా.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని జగన్ తన చేతలలో చేసి చూపించిన వైనం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.