చంద్ర‌బాబు ఆందోళ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-16 17:32:41

చంద్ర‌బాబు ఆందోళ‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత జ‌గ‌న్ కు చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సంక‌ల్ప‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌తో పాటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని, భ‌హిరంగ స‌భ‌లో ప్ర‌జా స‌మ‌క్షంలోనే వారికి అందుబాటులో ఉండే విధంగా వైసీపీ అధికారంలోకి వ‌స్తే కీల‌క హామీల‌ను ప్ర‌క‌టిస్తున్నారు జ‌గ‌న్. అయితే ముఖ్యంగా రైత‌న్న‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా సాగుచేసే పంట‌ల‌కు తొమ్మిది గంట‌ల పాటు ఉచిత క‌రెంట్, అలాగే రైతులు అకాల మ‌ర‌ణం చెందితే ఐదు ల‌క్ష‌లు ఇస్తామ‌ని తెలిపారు. ఇక దీంతో పాటు నాయి బ్ర‌హ్మ‌ణుల‌కు కార్పొరేష‌న్, అలాగే కేజీ నుంచి పీజీ వ‌ర‌కూ చ‌దువుకునే విద్యార్థుల‌కు ఉచిత విద్య‌ను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు జ‌గ‌న్.
 
ఇక ఈ హామీల‌ను విన్న కొంత‌మంది టీడీపీ నాయ‌కుల గుండెలు ట‌పేల్ మ‌ని పేలిన‌ట్లు అయింద‌ని తెలుస్తోంది. అయితే మ‌రి కొంద‌రు నాయ‌కులు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీలు అమ‌లుకు వేల కోట్ల రూపాయ‌లు కావాల‌ని అంటున్నారు. ఇక ఇదే విష‌యంపై ఎపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా స్పందించారు.  జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్న హామీల‌ను ప్ర‌జ‌లు ఎవ్వ‌రు న‌మ్మ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. ఒక‌వేళ‌ జ‌గ‌న్ హామీల‌ను న‌మ్మితే కుక్క‌తోక ప‌ట్టుకుని గోదావ‌రి ఈదిన‌ట్లు ఉంటుంద‌ని  ఎగతాళి కూడా చేశారు చంద్ర‌బాబు.
 
ఇక ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు బాగానే ఉన్నాయి కానీ, 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఏ మాత్రం నెర‌వేర్చ‌లేని ఆరువంద‌ల హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చారు. అయితే అధికారంలోకి వ‌చ్చి సుమారు నాలుగు సంవత్స‌రాలు పూర్తి అయినా కానీ చంద్ర‌బాబు ఒక్క హామీని కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేదు. ఇదే విష‌యాన్ని టీడీపీ నాయ‌కుల‌ను కానీ, కార్య‌క‌ర్త‌లను అడిగినా ఒక్క‌హామీని  కూడా అమ‌లు కాలేద‌ని చెబుతున్నారు.
 
అయితే చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌కు వైఎస్ జ‌గ‌న్ పూర్తిగా వ్య‌తిరేకం. అమ‌లు చేయ‌లేని హామీల‌ను ప్ర‌క‌టించి జ‌నాల‌తో విమ‌ర్శ‌లు చేయించుకోవ‌డం కంటే ప్ర‌తిప‌క్షంలో వుండేదే మంచిద‌ని భావించి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజారిటీ తో అధికారాన్ని కోల్పొయారు జ‌గ‌న్. ఇక 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా హామీల‌ను ప్ర‌క‌టిస్తున్నారు జ‌గ‌న్. ఇక జ‌నాలు కూడా జ‌గ‌న్ హామీల ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్న‌ట్లు చంద్ర‌బాబుకు అనుమానం మొద‌లైన‌ట్లుంది. అందుకే జ‌గ‌న్ హామీల విష‌యంలో చంద్ర‌బాబులో ఆందోళ‌న క‌నిపిస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.