విజ‌య‌సాయి రెడ్డి ఛాలెంజ్‌కు బాబు ఎందుకు స్పందించ‌డం లేదు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-30 13:13:30

విజ‌య‌సాయి రెడ్డి ఛాలెంజ్‌కు బాబు ఎందుకు స్పందించ‌డం లేదు..

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అండ్ కో లు అంద‌రూ క‌లిసి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ల‌క్ష‌కోట్ల‌  అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని త‌మ అనుకూల మీడియాతో ప్ర‌చారం చేయించిన సంగ‌తి తెలిసిందే. అయితే వారి ఆరోప‌ణ‌ల నేపథ్యంలో జ‌గ‌న్ ఒక వైపు పార్టీని, మ‌రోవైపు టీడీపీ నాయ‌కుల విమ‌ర్శ‌లను అదిగ‌మిస్తూ ఒంటెద్దు పోరాటం చేశారు. 
 
అయితే ఈ జ‌ర్నీలో జ‌గ‌న్ ఏ మాత్రం టీడీపీ నాయ‌కుల‌కు లొంగ‌లేదు. మొదట్లో న్యాయాన్ని త‌ప్పుగా స్వీక‌రించే  ఈ స‌మాజం ఎప్పటికైనా తాను అవినీతికి పాల్ప‌డ‌లేద‌నే నిజాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించి త‌న‌కు తోడుగా నిలుస్తార‌ని భావించారు జ‌గ‌న్. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న సిద్దాంత‌మే నిజం అయింది. ఏ నాయ‌కుడికి మ‌ద్ద‌తు ఇవ్వ‌నంత విధంగా రాష్ట్ర ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇక ఈ మ‌ద్ద‌తును చూసి టీడీపీ నాయ‌కులు గుట‌క‌లు మింగుతున్నారు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 
 
ఇక తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి గ‌త కొద్ది రోజుల నుంచి  జ‌గ‌న్ కు చేదోడు వాదోడుగా నిలుస్తూ టీడీపీ నాయ‌కులకు చుక్క‌లు చూపిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అండ్ కో లు సుమారు మూడుల‌క్ష‌లకు పైగా అవినీతికి పాల్ప‌డ్డార‌ని దానికి సంబంధించిన సాక్షాలతో స‌హా త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పి టీడీపీ నాయ‌కులకు చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు విజ‌య‌సాయి రెడ్డి. 
 
ఒక ప‌క్క జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు హామీల‌ను ప్ర‌క‌టిస్తు ముందుకు సాగుతుంటే మ‌రో ప‌క్క‌ విజ‌య‌సాయి రెడ్డి ప్రజలను పీక్కు తింటున్న రాష్ట్రాన్ని దోచేస్తున్నారంటూ చంద్ర‌బాబుకు  నిద్రపట్టకుండా చేస్తున్నారు.  ఇక తాజాగా  నారాలోకేష్ అవినీతి చిట్టా, అలాగే బాబు అండ్ కో లకు ఛాలెంజ్‌లు విసిరారు విజయసాయి రెడ్డి.
 
అలాగే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో పింక్ డైమండ్ క‌నిపించ‌డంలేద‌ని టీటీడీ ర‌మ‌ణ దీక్షితులు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డైమండ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసంలో క‌చ్చితంగా ఉంటుంద‌ని అది కూడా  12 గంట‌ల్లో సీబీఐ విచార‌ణ చేయించాల‌ని, ఒక‌వేళ‌ చంద్ర‌బాబు ఇంట్లో టీటీడీ డైమాండ్ లేకపోతే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని సంచ‌ల‌న స‌వాల్ విసిరారు విజ‌య‌సాయి రెడ్డి. దీంతో పాటు త‌మ‌కు గంటా వర్గం మొత్తం టచ్‌లో ఉందని కూడా బాబును హెచ్చరించారు విజయసాయి.
 
అయితే ఈ విష‌యాల‌పై చంద్ర‌బాబు అండ్ కో లు ఎలాంటి స్పంద‌న ఇవ్వ‌డంలేదు. నిన్న విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మ‌హానాడు స‌భ‌లో కూడా ఏ ఒక్క‌రూ విజ‌సాయి రెడ్డి విసిరిన స‌వాల్ పై స్పందించ లేదు. ఇక ఈ విష‌యంపై రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. టీడీపీ నాయ‌కులు గ‌తంలో జ‌గ‌న్ అవినీతికి పాల్ప‌డ్డారని ప్ర‌చారం చేశారు. అయితే జ‌గ‌న్ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు విజ‌య‌సాయి రెడ్డి విసిరిన స‌వాల్ కు ఎందుకు టీడీపీ నాయ‌కులు వెన‌క‌డుగు వేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. వారు కానీ వెన‌క‌డు వేస్తే క‌చ్చితంగా అవినీతికి పాల్ప‌డి ఉంటార‌ని ప్ర‌జ‌లు అనుమానిస్తున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. test

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.