జగన్ ఫోబియా పట్టుకుంది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-06-01 06:34:03

జగన్ ఫోబియా పట్టుకుంది

చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుంది అని వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి అన్నారు. ఈ రోజు సోషల్ మీడియా పై వఛ్చిన సర్వేలలో వైస్సార్సీపీకి భారత దేశంలోనే 4 వ స్థానం వచ్చింది అని మొదటి స్థానం లో బీజేపీ 2వ స్థానంలో కాంగ్రెస్ ౩వ స్థానంలో ఆప్ పార్టీలు ఉన్నాయని చంద్రబాబు గారు సోషల్ మీడియా పేడ్ వర్కర్స్ కోసం 7 కోట్లు నెలసరి జీతాలు ఇస్తూ పోషిస్తున్నప్పుడే చంద్రబాబుకు "జగన్ ఫోబియా పట్టుకుంది" అని ఆమె అన్నారు.
 
ఇంతచేసిన కానీ చంద్రబాబు పాలనావిధానం పై ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా వున్నారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంను సమర్థిస్తున్నారు అని అందుచేతనే వైస్సార్సీపీ సైనికులకు అండగా వుంటూ గారిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దేశములోనే నాలుగవ స్థానము ను సాధించారు అని ఇది జననేత సైనికుల విజయం అని ఎందుచేతనంటే సోషల్ మీడియాలో స్వచ్చందంగా ప్రజా సమస్యల పై పోరాడుతున్న వైస్సార్సీపీ వాలంటీర్ల పై టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేక కేసులు పెడుతూ ఇన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా అన్ని భరిస్తూ.. జగన్ అన్న బాటయే మా బాట అంటూ ఈ విజయానికి  కారణం అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు శైలజ చరణ్ రెడ్డి గారు . ఈ విజయం రాబోవు ఎన్నికలకు సూచికగా భావించవచ్చు అని ఆమె తెలియజేసారు.
 
అంతే కాకుండా మొన్న జరిగిన మహానాడులో టీడీపీ చేసిన వింతచేష్టలను చేస్తుంటే చంద్రబాబు అండ్ టీంకు నిజంగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని "జగన్ ఫోబియా" గట్టిగానే పట్టుకుంది అని ఆమె ఎద్దేవా చేసారు చంద్రబాబు గారు తనపై విశ్వాసాన్ని కోల్పోయారని జగన్ అంటే భయం పట్టుకుంది కాబట్టి తెలుగు తమ్ముళ్ళతో వైస్సార్ కుటుంభం పైన కథలు అల్లించుకొని మేకపోతు గాంబిర్యాన్ని ప్రదర్శిస్తున్నాడని ఆమె అన్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Ravali Jagan kavali Jagan

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.