జగనన్నా.. మజాకా.. ఇక్కడ కొడితే అక్కడ పడ్డాడు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-11-02 01:50:44

జగనన్నా.. మజాకా.. ఇక్కడ కొడితే అక్కడ పడ్డాడు..

40 సంవత్సరాల ఇండస్ట్రీ.. రాజకీయ నాయకులతో ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి.. ప్రధాని మోడీ కన్నా సీనియర్ నాయకుడు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని పరుగులు పెట్టిస్తున్నారు వైసిపి అధ్యక్షుడు జగన్.. వైసిపి ట్రాప్ లో చంద్రబాబునాయుడు పడిపోయారని నరేంద్రమోడి పార్లమెంటులో అన్నారో తెలీదుకానీ ఆ మాట మాత్రం నిజమే అనిపిస్తోంది. ఇక్కడ మాన్తా పెడితే వెళ్లి ఢిల్లీలో మాటలార్పడానికి ట్రై చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు అర్ధమయ్యి ఉంటుంది.. జగన్ క్యాలిబర్ ఏంటో.. 
 
గడచిన వారం రోజులుగా ఏపీ లో రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి.. వారం క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే జగన్ పై దాడి జరిగిందో అప్పటి నుండి చంద్రబాబు హత్యాయత్నం ఘటన గురించే మాట్లాడుతున్నారు. గడచిన వారం రోజులుగా జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి చంద్రబాబు దగ్గర నుండి టిడిపి నేతల వరకూ సుమారు 60 మీడియా సమావేశాల్లో మాట్లాడారట. ఎన్ని మీడియా సమావేశాల్లో మాట్లాడినా తమ వాదనకు తగిన ఆధారాలైతే చూపలేకపోతున్నారు.
 
పోనీ జగన్ ది డ్రామానే అనుకున్నా ఆ డ్రామాను కూడా నిరూపించలేకపోతున్నారు. దాంతో జగన్ పై జరిగింది నిజంగా హత్యాయత్నమే అని జనాలు కూడా నమ్ముతున్నారు. గడచిన వారం రోజులుగా పార్టీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్సులు, సమీక్షా సమావేశాలు, బహిరంగసభలు ఇలా ఎక్కడ మాట్లాడినా జగన్ పై జరిగిన హత్యాయత్నాన్నే చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో చాలదన్నట్లుగా ఢిల్లీకి వెళ్ళి మీడియా సమావేశంలో జగన్ విషయాన్నే మాట్లాడారు. మళ్ళ