బాబుకు టెన్ష‌న్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and rajasekhar reddy padayatra
Updated:  2018-04-03 05:43:04

బాబుకు టెన్ష‌న్ ?

1995 నుండే ఢిల్లీ రాజకీయాలను శాసించా... నా పేరు చెప్తె ఢిల్లీ గజ గజ వణికేది....అందుకే అప్పట్లో ప్రధాని పదవి కూడా ఆఫర్ వచ్చింది...కానీ మా పుత్ర రత్నం ముందు చూపుతో ఆలోచించి, ఈ రాష్ట్రానికి మీ అవసరం ఎంతో ఉంది అని చెప్పడంతో ప్రధాని పదవిని త్యాగం చేశా, ఇలా ఒకటా రెండా రాష్ట్రం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశా అని బల్ల గుద్దిమరీ చెప్తుంటారు చంద్రబాబు.
 
ఢిల్లీని వణికించే బాబుకు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని చూస్తే మాత్రం చంద్రబాబుకు వణుకు వచ్చేది...2003 లో రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రతో ప్రజలకు నమ్మకాన్ని కల్గించడంతో ప్రజలు హాయిగా నిద్రపోతుంటే చంద్రబాబుకు మాత్రం నిద్రలో కూడా రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రే కనిపించేది...అప్పటి నుండి రాజశేఖర్ రెడ్డిని చుస్తే కలలో కూడా నిద్ర వచ్చేది కాదు... రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో చంద్రబాబు హాయిగా నిద్రపొదాం అనుకున్నాడు.
 
చంద్రబాబుకు జగన్ రూపంలో మరో రాజశేఖరుడు రావడంతో బాబుకు నిద్ర కరువు అయింది... చంద్రబాబుకు రాజశేఖర్ రెడ్డి కలలో మాత్రమే కనిపించేవాడు కానీ జగన్ మాత్రం ఏకంగా బాబు గుండెలపైనే నిద్రపోతున్నాడు... నవరత్నాలు నుండి జగన్ వేస్తున్న ఒక్కొక అడుగుతో బాబుకు వెన్నులో వణుకుపుడుతుంది...పాదయాత్రతో రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉంటె, జగన్ ఆయన వారసుడిగా ఒకడుగు ముందుకువేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే, చంద్రబాబు గుండెల్లో నిద్రపోతున్నాడు...
 
నవరత్నాలు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని దోపిడీ, ఇసుక మాఫియా, పాదయాత్ర, అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు, ప్రత్యేక హోదా కోసం దీక్షలు ఇలా ఒకటా రెండా జగన్ వేస్తున్న ఒక్కొక అడుగుతో  చంద్రబాబుకు ఏమి చేయాలో తెలియక నాలుకతో మడత మొదలైంది...ప్రజల ముందరికి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక తన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు....

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.