బీజేపీ పై చంద్ర‌బాబు ఫైర్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu tdp bjp war
Updated:  2018-03-25 03:40:09

బీజేపీ పై చంద్ర‌బాబు ఫైర్‌

అమ‌రావ‌తిలో టెలికాన్ప‌రెన్స్  నిర్వ‌హించిన సీఎం చంద్ర‌బాబు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నా మీద, ప్ర‌భుత్వం పై అవినీతి కేసులు వేయ‌డం ఏంట‌ని చంద్ర‌బాబు కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ముందుగా అమిత్ షా , ఆయ‌న కోడుకు అవినీతి వ్య‌వ‌హారం తేల్చాలి అని  చంద్ర‌బాబు అన్నారు.. ఆయ‌న కోడుకు పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని తెలియ‌చేశారు... గ‌త నాలుగేళ్లుగా వ్య‌వ‌స్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం భ్ర‌ష్టు ప‌ట్టించింద‌ని అన్నారు.
 
నీతులు చెప్పే బీజేపీ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిందని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఒక్క రాజ్య‌స‌భ సీటు కోసం బీజేపీ ఎంత దిగ‌జారుడు రాజ‌కీయాలు చేసిందో తెలుస‌ని వ్యాఖ్యానించారు.  గుజ‌రాత్ లో రాజ్య‌స‌భ సీటు కోసం ఏమి చేశారో తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. టీడీపీకి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు  త‌క్కువ ఉన్నా విలువ‌ల కోసం మూడో సీటుకు పోటీ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు తెలిపారు.
 
మొత్తానికి ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అమిత్ షా లేఖ ఇటీవ‌ల  బాబుకు పంప‌డం... ఏపీలో బీజేపీ జ‌న‌సేన క‌లిసిన‌ట్టు వార్త‌లు రావ‌డం త‌మిళ‌నాడు త‌ర‌హా రాజ‌కీయాలు ఏపీలో చేయాలి అని చూస్తున్న బీజేపీని  ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి అని చంద్ర‌బాబు అనుకుంటున్నారు అని నాయ‌కులే అంటున్నారు.. ఇక్క‌డ ఎటువంటి కేసుల ప్ర‌స్తావ‌నా రాక‌పోయినా చంద్ర‌బాబు ఎందుకు  కేంద్రం కేసుల గురించి మాట్లాడుతున్నారు అని ఏదో కేంద్రం ద‌గ్గ‌ర కీల‌క విష‌యం ఉండే ఉంటుంది అని విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.