మంత్రుల‌పై సీరియ‌స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:30:00

మంత్రుల‌పై సీరియ‌స్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మంగళవారం సాయంత్రం గోదావరిలో జ‌రిగిన లాంచీ ఘటన‌కు సంబంధించి కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో  మంత్రుల‌పై అలాగే అధికారులపై  క్లాస్ తీసుకున్నారు చంద్ర‌బాబు. గోదావ‌రి న‌దిలో ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత హుటా హుటిన అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటే ఏం ప్రయోజనమని, ఈ ప్ర‌మాదం జ‌రుగ‌కముందే ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుని ఉంటే బాగుండేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ఇక దీంతో పాటు  కొద్ది రోజుల క్రితం కృష్ణా నదిబోటు ప్రమాదంపై కూడా కెబినెట్ లో చంద్ర‌బాబు స్పందించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అధికారులు ఒక కమిటీ వేశారాని, అయితే  ఆ కమిటీకి సంబంధించి ఆధారాలు ఇప్పటి వరకు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ క‌మిటీలో అధికారులు ఎందుకు జోక్యం చేసుకోవ‌ట్లేద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఇక కృష్ణాన‌ది, నిన్న‌జ‌రిగిన గోదావ‌రి న‌దిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించి కొత్త‌గా క‌మిటీ వేసి త‌న‌కు వెంట‌నే అధారాలు తెలియ‌జేయాల‌ని అధికారుల‌కు చంద్ర‌బాబు సూచించారు.
 
ఇక మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు గోదావ‌రి ఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో అధికార నాయకుల‌ను విమ‌ర్శిస్తున్నారు. గోదావ‌రి న‌దిలో లైసెన్స్ లేని బోట్ల‌ను టీడీపీ నాయ‌కులు అనుమ‌తించి అక్ర‌మంగా తిర‌గ‌నిస్తున్నార‌ని, అలా తిరగ‌నీయడం వ‌ల్లే అమాయ‌క ప్ర‌జ‌లు బ‌లైపోతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. గ‌డిచిన ఆరు నెలల్లో మూడు ఘోర ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయ‌ని, అయితే ఘ‌ట‌న‌ల‌పై క‌మిటీ వేశామ‌ని చెప్పి టీడీపీ నాయ‌కులు త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని ప్ర‌తిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.