చంద్ర‌బాబు టీడీపీ ఎమ్మెల్యేకు స్పెష‌ల్ క్లాస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu
Updated:  2018-07-20 11:32:29

చంద్ర‌బాబు టీడీపీ ఎమ్మెల్యేకు స్పెష‌ల్ క్లాస్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మ‌ధ్య వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌బండ‌కు ఎక్కుతున్నాయి. అందులో ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌ ప్రాంతాల‌లో వ‌ర్గ పోరు ఎక్కువ గా ఉంది. దీంతోపార్టీ అధినేత‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రంగంలో దిగి వారికి స్పెష‌ల్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో మొద‌టిగా అనంత‌పురం అర్భ‌న్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రిని స‌చివాల‌యానికి పిలిపించుకుని చంద్ర‌బాబు ఆయ‌న‌తో నేరుగా మాట్లాడి స‌ర్ది చెప్పి పంపించిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అంద‌రితో క‌లిసి క‌ట్టుగా పని చేయాల‌ని సూచించార‌ట‌.
 
ఆ త‌ర్వాత ప్ర‌భాక‌ర్ చౌద‌రి అనంత‌పురంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, త‌న‌కు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి రోడ్ల విస్త‌ర‌ణ‌ నేప‌థ్యంలో వ‌ర్గ విభేదాలు ఉన్నాయ‌న్న‌మాట వాస్త‌వ‌మేన‌ని  ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ వ‌ర్గ‌పోరు నేథ్యంలో సీఎం చంద్ర‌బాబు త‌న‌ను అమ‌రావ‌తికి పిలిపించుకుని మాట్లాడార‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన త‌ర్వాత మా ఇద్ద‌రి మ‌ధ్య ఎందువల్ల‌ విభేదాలు వ‌చ్చాయో ఆయ‌నకు వివ‌రించాన‌ని ప్ర‌భాక‌ర్ చౌద‌రి తెలిపారు. ఇక తాను చెప్పిన విష‌యాల‌ను ప‌రిగ‌న‌లోకి తీసుకున్న చంద్ర‌బాబు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఎవ‌రితో విభేదాలు పెట్టుకోకుండా పార్టీ కోసం క‌లిసి మెల‌సి ప‌నిచెయ్యాల‌ని సూచించార‌ని ఆయ‌న తెలిపారు. 
 
అయితే జేసీకి త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి విభేదాలు లేవ‌ని, కానీ రాజ‌కీయంగా విభేదాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. 1996లో తాను మున్సిపల్‌ చైర్మన్‌గా చేసినప్పుడు అనంతపురంలో రోడ్ల నిర్మాణ విషయంలో కొన్ని రాజకీయ విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ప్రభాకర్‌ చౌదరి తెలిపారు. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబ‌ట్టి క‌లిసి ప‌ని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అనంత‌పురం పార్ల‌మెంట్ స‌భ్య‌డు కాబ‌ట్టి ఆయ‌న ఏ ప్రాతం అయినా తిరిగే హక్కు ఉందని అలాగే తాను కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గాన్నిఅభివృద్ది చేసుకుకోవాల‌ని  సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.