బాబు ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-11 16:57:16

బాబు ఫైర్

ద‌ళితులుగా ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా అని గ‌తంలో చంద్ర‌బాబు వ్యాఖ్యలు చేశారు.. ఇక ద‌ళితులు శుభ్రంగా ఉండ‌రు అంటూ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్ప‌టికీ పార్టీలో ఎంత విప‌త్క‌ర‌ప‌రిస్దితులు ఎదుర్కుంటున్నాయో తెలిసిందే. ఎక్క‌డికి వెళ్లినా తెలుగుదేశం పార్టీ పై ద‌ళితులు ఈ విష‌యం పై ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు.
 
ఇక ఈ వివాదం నుంచి ప‌క్క‌కు రావ‌డానికి ద‌ళిత తేజం అనే కొత్త కార్య‌క్ర‌మం తెలుగుదేశం తెరపైకి తీసుకువ‌చ్చినా, దీనిపై వారు హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డం లేదు. ఇక తాజాగా ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి పొందిన వ‌ర్ల రామ‌య్య నిన్న ద‌ళిత యువ‌కుడిపై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెను దుమారం లేపాయి. ఇటు మీడియాలో అలాగే సోష‌ల్ మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే త‌మ కులం వారు బాగుండాలి అని తాను ఓ తండ్రిగా పెద్ద‌గా చెప్పాను దానిని వ‌క్రీక‌రించారు అని అన్నారు ఆయ‌న‌.
 
ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నిన్న మ‌చిలీప‌ట్నం ఆర్టీసీ బ‌స్డాండ్ లో. అయితే  ఓ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇదేమీ పట్టించుకోకుండా తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇది గమనించిన వర్ల రామయ్య ఆ ప్రయాణికుడి కులం గురించి అడిగి తెలుసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు అస‌లు చ‌ద‌వరు అంటూ కులం పేరుతో వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీలో ద‌ళిత నాయ‌కులు కూడా విమ‌ర్శిస్తున్నారు ఇటువంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం పై వారు పార్టీలో ర‌గిలిపోతున్నారు.
 
సోష‌ల్ మీడియా లో ఈ అంశం వైర‌ల్ అవ‌డంతో. సీఎం చంద్ర‌బాబు వెంట‌నే వ‌ర్ల తో మాట్లాడారాట. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం పార్టీ ప‌రువును బ‌జారున పెట్ట‌డం పై ఆయ‌న మంద‌లించారు అని తెలుస్తోంది. మరోవైపు వర్లపై విపక్ష నేతలతో పాటు దళిత సంఘాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి. జరిగిన ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.