కొత్త కార్య‌క్ర‌మానికి బాబు దండోరా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:47:38

కొత్త కార్య‌క్ర‌మానికి బాబు దండోరా

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌లు ఊహించ‌ని విధంగా మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి తెర‌లేపారు... ఏపీ లో జ‌రుగుతున్న‌ అన్యాయంపై టీడీపీ నాయ‌కులు మ‌రింత శ్ర‌మించి పోరాటం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఈ రోజు అమ‌రావ‌తిలో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వహించారు.. ఈ స‌మావేశానికి టీడీపీ రాజ్య‌స‌భ సభ్యులు, శాస‌న స‌భ వ్యూహ క‌మిటీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. 
 
ఈ టెలికాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న మాట్లాడుతూ.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల‌ను అలాగే ప్ర‌త్యేక హోదా వంటి అంశాల‌ను కేంద్రం ప్ర‌క‌టించకుండా ఏపీకి అన్యాయం చేయాల‌ని చూస్తోంద‌ని అన్నారు... అయితే మ‌నం ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే ఊహించ‌ని ప‌రిణామాలు ఎదుర్కోవ‌ల‌సిన‌ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌నని తెలిపారు... అందుకోస‌మే ప్ర‌తీ ఒక్క‌రూ  కేంద్రం వైఖ‌రి ప‌ట్ల‌ ప్ర‌జ‌ల‌కు పూర్తిగా తెలియ‌జేయాల‌ని, వారికి హోదా ప‌ట్ల‌ అవ‌గాహ‌న క‌ల్పించే  విధంగా చేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు.
 
అయితే గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా టీడీపీ నాయ‌కులు ఎన్డీఏతో మిత్ర ప‌క్షంగా ఉన్న‌ప్పుడు రాష్ట్ర స‌మ‌స్య‌లు గుర్తుకు రాలేదా! అని ప‌లు చోట్ల ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు... విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను రాష్ట్రంలో ప్ర‌తీ ఒక్క‌రికి అవ‌గాహ‌న ఉంద‌ని, మ‌ళ్లీ ఇప్పుడు తెలుగుదేశం నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు... కాగా మ‌రి కొంద‌రు బాబుగారు మీరు చేస్తున్న‌ది నిజ‌మేనా! మాకు డౌటే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
ఇదంతా చంద్ర‌బాబు త‌మ నాయ‌కుల చేత‌ కావాల‌నే చేయిస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు తెలుపుతున్న మ‌ద్ద‌తును చూసి స‌హించ‌లేక ఈ కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు తెర‌లేపార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.