బాబు అస్త్రం ఫెయిలే..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 13:09:41

బాబు అస్త్రం ఫెయిలే..

చిత్తూరు జిల్లా పేరు చెప్ప‌గానే ముందుగా వినిపించేది  తెలుగుదేశం పార్టీ అధినేత  సీఎం చంద్ర‌బాబు పేరు...  ఇక మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలో చేర‌డంతో ఇక్క‌డ తెలుగుదేశం తిరుగులేదు అనే రేంజ్ లో రాజ‌కీయాలు చేస్తోంది. గ‌తంలో కంటే తాము మరింత బ‌ల‌ప‌డ్డాము అనే ఆలోచ‌న‌లో ఉంది తెలుగుదేశం.
 
చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంటున్న తాజా రాజ‌కీయ పరిణామాలు గురించి తెలుసుకుంటే ఇప్పుడు పార్టీ బ‌లాబ‌లాలు తెలుస్తాయి.. చిత్తూరు జిల్లాలో న‌ల్లారి కుటుంబం పేరు ఉన్న కుటుంబం, రాజ‌కీయంగా ఎప్ప‌టి నుంచో న‌ల్లారి కుటుంబం జిల్లాలో కీల‌కంగా ఉంటుంది..... జిల్లాలోని నగరిపల్లె వారి సొంతూరు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి హయాం నుంచి అంటే సుమారు 60 ఏళ్ళుగా కాంగ్రెస్‌పార్టీతో వారికి అనుబంధం ఉంది.
 
ముఖ్యంగా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలతో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే నల్లారి కుటుంబానికి కాంగ్రెస్‌పార్టీలో ఎనలేని ప్రాధాన్యం ఉండేది కాంగ్రెస్ నేత‌లు హ‌స్తిన‌లో కూడా న‌ల్లారి కుటుంబానికి అంతే ప్ర‌యారీటి ఇచ్చేవారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి చిత్తూరుజిల్లాలో సీనియర్‌ నేతల్లో ఒకరు. అప్పట్లో ఆయన మాటకు తిరుగుండేది కాదు. 1962లో వాయల్పాడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు దఫాలు మంత్రి పదవులు చేపట్టారు. 1987లో అమర్‌నాథ్‌రెడ్డి కన్నుమూశారు.
 
ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి విషయానికి వస్తే.. చిన్నప్పటినుంచి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన రాజకీయ వారసుడుగా కుటుంబం నుంచి  1989లో తెరపైకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగారు. పలుమార్లు చట్టసభకి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలలో పీలేరు నుంచి గెలిచిన తర్వాత ఆయన స్పీకర్‌ పదవి దక్కింది. ఆత‌ర్వాత వైయ‌స్ మ‌ర‌ణం త‌ర్వాత , రోశ‌య్య ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిన త‌ర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల ఫలితంగా అనూహ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.. ఇక ఆయన ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా చేశారు... చివ‌రి సీఎంగా కూడా ఆయ‌న త‌న బాధ్య‌త‌లు చేప‌ట్టి రికార్డు సృష్టించారు. 
 
ఇక రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు... గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది... కిరణ్‌ సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి పీలేరులో  అన్న పార్టీ త‌ర‌పున పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి  కుటుంబం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో నల్లారి కుటుంబానికి చెందిన అనుచరులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తల్లోనూ న‌ల్లారి కుటుంబం త‌దుప‌రి ప్ర‌ణాళిక ఏమిటి అనేది మొద‌లైంది.
 
ఇక సోద‌రులు ఇద్దరూ బీజేపీలో చేరుతారు అంటూ ప‌లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి రెండు సంవ‌త్స‌రాలుగా..ఇక చివ‌ర‌కు కొన్ని నెల‌ల త‌ర్వాత సోద‌రుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలోకి చేరారు.. దీని వెనుక జిల్లా నాయ‌కులు అంద‌రూ మంత‌నాలు జ‌రిపారు... సీఎం కూడా ఆయ‌న ఎంట్రీ పై సుముఖ‌త చూపించారు. ఇక సోద‌రుడు మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేర‌కుండా ఉండిపోయారు.
 
చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా చెప్పుకుంటే పీలేరు నియోజవర్గంలో టీడీపీ చాలా బలహీనంగా ఉంది. గత నాలుగు ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. 20 ఏళ్లుగా కేడ‌ర్ కూడా చెల్లా చెద‌రు అయింది అనే చెబుతారు...1994 లో జీవీ శ్రీనాథ‌రెడ్డి తెలుగుదేశం త‌ర‌పున గెలిస్తే ఇక త‌ర్వాత మూడుస్లారు కాంగ్రెస్ గెలిచింది ఇక 2014 లో వైసీపీ గెలిచింది.
 
దీంతో స్థానికంగా టీడీపీకి నాయకత్వ సమస్య తలెత్తింది. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఈ తరుణంలో కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలోకి చేరడంతో ఇక్క‌డ పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంది అని అనుకున్నారు.. అయితే రాజ‌కీయంగా  సోద‌రుడికి కుటుంబానికి 30 ఏళ్లుగా రాజ‌కీయంగా వెన‌కాల స‌ల‌హాలు ఇస్తూ ముందుకు వెళ్లారు కిషోర్ రెడ్డి.. అయితే అవేమి 2014 ఎన్నికల్లో ఫ‌లించ‌లేదు ఏకంగా సీఎం త‌మ్ముడు అనే క్రెడిబులిటీ కూడా ఆయ‌న‌కు క‌లిసిరాలేదు ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు అన్న‌య్య పార్టీ త‌ర‌పున పోటీచేసి.
 
పార్టీలో చేరిన వెంట‌నే చంద్ర‌బాబు, కిషోర్ కుమార్ రెడ్డికి  ఐడీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో కేడ‌ర్ కు కూడా చంద్ర‌బాబు న‌ల్లారి కుటుంబానికి ప్ర‌యారీటీ ఇస్తున్నారు అని అంద‌రూ అనుకున్నారు.... ఇక 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్ది చింత‌ల రామ‌చంద్రారెడ్డి విజ‌యం సాధించారు.. అయితే త‌నసొంత జిల్లాలో వైసీపీ ఇంత బ‌లంగా ఉండ‌టం బాబుకు ఓ పెద్ద గుదిబండ‌లా మారింది... ఇక సొంత జిల్లాలో జ‌గ‌న్ కు కూడా పాద‌యాత్ర‌కు జ‌నం భారీగా వ‌చ్చారు, ఇవ‌న్నీబాబు ఆలోచించి న‌ల్లారి ఫ్యామిలీకి ఇక్క‌డ ఉన్న కేడ‌ర్ మ‌న‌కు మ‌రింత ఉప‌యోగ‌ప‌డ‌తారు అని భావిస్తున్నారు..
 
ఇక ఇక్క‌డ పెద్ది రెడ్డి కుటుంబం  పై బాబు రాజ‌కీయంగా ఆలోచ‌న చేస్తున్నారు... అయితే గ‌తంలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎమ్మెల్యేగాఉంటే ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు ఎంపీ గా రాజంపేట నుంచి ఉండ‌టం జ‌గ‌న్ కు మ‌రింత వెన్నంటి ఈ కుటుంబం ఉండ‌టం బాబుకు జిల్లాలో మ‌రింత హీట్ పెంచుతోంది.. జిల్లా రాజకీయాల్లో వైసీపీ తర‌పున క్రియాశీల‌కంగా ఉంటున్నారు... వీరికి అడ్డుక‌ట్ట వేయ‌డానికి కూడా బాబు న‌ల్లారి కుటుంబాన్ని ఎంచుకున్నారు అంటారు.
 
గతంలో పీలేరు నుంచి, ప్రస్తుతం పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డికి ఇప్పటికీ పీలేరు, మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో బలమైన వర్గం ఉంది. వీరిని తెలుగుదేశానికి మ‌ళ్లించుకోవాలి అనేది బాబు ప్లాన్ అయితే ఇవ‌న్ని కుదిరేవి కావు అంటున్నారు జిల్లా నాయ‌కులు.. పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎదుర్కోవ‌డం క‌ష్టం అంటున్నారు.
 
పుంగనూరులో పెద్దిరెడ్డిని, రాజంపేటలో మిథున్‌రెడ్డిని దెబ్బతీసి ఆయా స్థానాల్లో పసుపుపచ్చ జెండా ఎగిరేలా చేయాలన్నది టీడీపీ హైకమాండ్‌ పట్టుదల గా తెలుస్తోంది.. ఇందుకోసమే నల్లారి కుటుంబాన్ని ఇలా తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతోంది. ఈ కారణంగానే నల్లారి కుటుంబాన్ని చంద్రబాబు టీడీపీలోకి తీసుకువచ్చి పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టాల‌ని భావించినా ప్ర‌స్తుతం స‌ర్వేలో కూడా పెద్దిరెడ్డి కుటుంబానిదే ఇక్క‌డ  హవా అని తేలింది..
 
యువ ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఇక్క‌డ దూసుకుపోతున్నారు...ఇటు జిల్లాలో వారు ఎవ‌రి వైపు ఉన్నా పెద్దిరెడ్డి ఫ్యామిలీకి స‌పోర్ట్ అంటున్నారు జిల్లా నాయ‌కులు.. ఇటు వైసీపీలో ఆ ఫ్యామిలీని ఓడించే స‌త్తా న‌ల్లారి ఫ్యామిలీకి లేదు అని వైసీపీ నాయ‌కులు ఇక్క‌డ ప్ర‌జ‌లు కూడా చెబుతున్నారు...మొత్తానికి బాబు సొంత జిల్లాలో తీసుకున్న ప్లాన్ వ‌ర్క అవుట్ అవుతుందా లేదా అనేది త‌మ్ముళ్ల‌కే ఓ ప్ర‌శ్న‌గా ఉంది జిల్లాలో.
 
విశ్లేష‌ణ‌!! గ‌ణేష్ వ‌జ్ర‌పు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.