వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్స్ పై బాబు కక్ష?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:20:36

వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్స్ పై బాబు కక్ష?

ఏపీలో  రెండు మూడు రోజులకోసారి వైసీపీ సోషియ‌ల్ వాలంటీర్స్ ను అరెస్ట్ చేస్తున్నారు...అరెస్ట్ చేసి వైసీపీ సోసియల్ వాలంటర్స్ ని భయపెట్టడానికి కావాలనే టీడీపీ నాయకులు ఆడుతున్న నాటకమని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు చంద్రబాబు పాలనను గాలికి వదిలేసి నిజాలను ప్రజలకు చేరేలా చేస్తున్న వైసీపీ సోసియల్ వాలంటీర్స్ మీద పడ్డారని అన్నారు వైసీపీ శ్రేణులు.
 
మరో వైపు వైసీపీ సోసియల్ వాలంటీర్స్ కూడా టీడీపీపైన మండిపడుతున్నారు..మేము ఎవరిని కించపరచకుండా పోస్ట్ లు పెట్టిన మమల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.అదే టీడీపీ సోషల్ మీడియా అసభ్యకరమైన పదాలు వాడుతూ పోస్ట్ లు చేసిన వారిపైన ఎలాంటి చర్యలు ఉండవని ఆరోపించారు వైసీపీ సోసియల్ వాలంటీర్స్... ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు నిజాలు తెలిసేలా వ్యవహరిస్తున్న వైసీపీ సోసియల్ వాలంటీర్స్ పై ముఖ్యమంత్రి  చంద్రబాబు కక్ష పెంచుకున్నారని వైసీపీ సోసియల్ వాలంటీర్స్ ఆరోపణలు చేస్తున్నారు..టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఎత్తిచూపితే అక్రమంగా అరెస్ట్ లు చేపిస్తున్నారని మండిపడ్డారు వాళ్ళు.
 
ప్రజలకి సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి చేతకాక నిస్సిగ్గుగా ప్రశ్నించిన ప్రతి ఒక్కర్ని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు..టీడీపీ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్న వాళ్ళు సూర్య కిరణాలు లా కోకొల్లలుగా ఉన్నారు...మీరు ఎంత మందిని అరెస్ట్ చేయగలరు అని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ముఖ్యమంతి పాలన రాష్ట్ర ప్రజలకు కాకుండా టీడీపీ నాయకులకు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. మీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు.. మీ పాలనకు ముగింపు పలికే రోజులు త్వరలో ఉన్నాయని అన్నారు వైసీపీ సోసియల్ వాలంటీర్స్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.