జ‌గ‌న్ హామీ.... బాబు అమ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-16 11:08:31

జ‌గ‌న్ హామీ.... బాబు అమ‌లు

నిజంగానే ఏపీలో అస‌లు సిస‌లైన రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్ర‌తిపక్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో రాజీనామాల ప్ర‌క‌ట‌న ప‌ర్వం కొన‌సాగుతోంది..ఈ రాజీనామా డ్రామాలు ఎంత వ‌ర‌కు నిజ‌మౌతాయో చూడాలి. 
 
ఇక ప్ర‌జా సంకల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాల‌తో పాటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను విన్న త‌ర్వాత కూడా ప‌లు కీల‌క హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే ప‌రిశ్ర‌మ‌ల్లో 80 శాతం స్ధానికుల‌కే అవకాశాలు కల్పిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించి  మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే  తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. 
 
అయితే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ఈ హామీని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అమ‌లు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఏపీలో ఏర్పాటు చేయ‌నున్న ప‌రిశ్ర‌మ‌ల్లో న‌భై శాతం ఉద్యోగాలు స్దానికుల‌కే క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు త‌యారు చేయాల‌ని కూడా అధికారుల‌కు సీఎం సూచించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.