ఎమ్మెల్సీ టికెట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-28 18:18:36

ఎమ్మెల్సీ టికెట్

దివంగ‌త నేత మాజీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు అకాల మ‌ర‌ణంతో ఆయ‌న స్ధానానికి ఎన్నిక అనివార్యం అయింది. దీనిపై కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు స్ధానం ఎవ‌రికి ఇస్తారు అని జిల్లాలోనే కాదు న‌గ‌రిలో తెలుగుదేశంలో చ‌ర్చించుకున్నారు.. ఇక గాలి ఇద్ద‌రు కుమారులు ఈ సీటు ఆశించినా చివ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు దివంగత నేత గాలి ముద్దుకృష్ణనాయుడు సతీమణి గాలి సరస్వతమ్మకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ టిక్కెట్ ఖ‌రారుచేశారు.
 
ఈ ఉదయం సీఎంను గాలి సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలుసుకున్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్‌‌ను సరస్వతమ్మకు ఖరారు చేసినట్లు సీఎం చంద్రబాబు వారికి తెలియజేశారు. ఇక సరస్వతమ్మకు టిక్కెట్ కేటాయింపుపై గాలి కుటుంబసభ్యుల్లోనూ ఏకాభిప్రాయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై బాబు ఇక ఫైన‌ల్ డెసిష‌న్ ఇదేన‌ని తెలియ‌చేశార‌ట‌.
 
చిత్తూరు ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 21 న జరుగనుంది. ఇందుకోసం రెండు రోజుల క్రితమే షెడ్యూల్‌ విడుదలైంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు అకాల మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంతో పాటు మహారాష్ట్రలో ఆరు స్థానాలకు అదే రోజున ఎన్నికలు జరుగుతాయి.  ఇక ఇద్ద‌రు త‌న‌యులు కాకుండా ఆమె పేరు ఫైన‌ల్ అవ‌డం పై, ఎవ‌రూ ఊహించ‌ని పేరు ఫైనల్ అయింది అని చ‌ర్చించుకుంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.