అఖిల‌కు బాబు షాక్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-17 16:05:34

అఖిల‌కు బాబు షాక్..?

వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్దులు క‌ర‌వు అయ్యారు అంటూ వీర లెవల్లో తెలుగుదేశం ప్ర‌గ‌ల్బ‌పు వార్తా ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంది... అయితే ఓ ప‌క్క జ‌గ‌న్ వ‌ర్క్ చేసుకుంటూనే ఉన్నారు  క‌ర్నూలు జిల్లాలో... ఓ కీలక నాయ‌కుడి ద్వారా జిల్లాలో రాజ‌కీయ ప‌రిస్దితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ చావు దెబ్బ‌తింది. అందుకే తెలుగుదేశం జ‌గ‌న్ కు ఇక్క‌డ విజ‌యం ద‌క్క‌కూడ‌దు అనే ఉద్దేశంతో ఉంది. 
 
అయితే పార్టీ ఫిరాయించారు క‌ర్నూలు జిల్లా నుంచి భూమా ఫ్యామిలీ.. వైసీపీ త‌ర‌పున గెలిచిన  ముగ్గురు భూమా ఫ్యామిలీ నాయ‌కులు పార్టీ మారారు.. ఇటు క‌ర్నూలు ఎమ్మెల్యే ఎస్వీమోహ‌న్ రెడ్డి, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ‌, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి... ఇక నాగిరెడ్డి మ‌ర‌ణంతో అక్క‌డ భూమా బ్ర‌హ్మ‌నంధ‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.
 
ఆయ‌న కుమార్తె భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ఆళ్ల‌గ‌డ్డ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు... గ‌తంలో అఖిల‌తో పొస‌క్క పార్టీ మార‌తారు అని ద్వీతీయ శ్రేణి నాయ‌కత్వం అల‌క‌గానే ఉంది..దీనిపై  అనేక వార్త‌లు వినిపించాయి. అయితే ఇటు సెగ్మెంట్లో వ‌స్తున్న వార్తల ప్ర‌కారం నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రావ‌డంతో ఇప్పుడు నంద్యాల ఎంపీ సీటు పై తెలుగుదేశం ఆలోచ‌న చేస్తోంది.
 
నంద్యాల సెగ్మెంట్లో భూమా ఫ్యామిలీకి మంచి ఫేమ్ ఉంది అనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం అధినేత వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా అఖిల ప్రియ‌ను ఎంపీగా నిల‌బెట్టాలి అని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.
 
ఇక ఆళ్ల‌గ‌డ్డ‌లో వారి వైరి వ‌ర్గం గంగుల ప్ర‌తాప్ రెడ్డిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి తీసుకురావాలి అని ఆళ్ల‌గ‌డ్డ  టికెట్ ఆయ‌న‌కు కేటాయించాలి అని ఆలోచిస్తున్నారు... పైగా జిల్లాలో స‌ఖ్య‌త‌లేని కార‌ణంగా  శిల్పా ఫ్యామిలీ కూడా తెలుగుదేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది... ఈ ప‌రిణామాల‌తో తెలుగుదేశం గురించి కూడా జిల్లా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. ఇక ఏవీ సుబ్బారెడ్డి వ‌ర్గం కూడా అఖిల‌తో పొస‌గ‌ని విధంగా ఉంది. మొత్తానికి అఖిల‌కు వ‌చ్చే ఎన్నికల్లో బాబు హ్యాండ్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.