గిడ్డి ఈశ్వరికి షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 12:53:34

గిడ్డి ఈశ్వరికి షాక్

2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్  పార్టీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో  గెలిచి ఆ త‌ర్వాత అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు.అయితే వారు టీడీపీ తీర్థం తీసుకున్న త‌ర్వాత ముఖ్య‌మంత్రి దగ్గ‌ర మార్కులు కొట్టేయ్యాల‌నే నేప‌థ్యంతో 2014 లో రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మీడియా స‌మావేశం ఏర్పటు చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.  కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వ లేదు
 
అయితే ఈ క్ర‌మంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంద‌ని విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందులో  ముఖ్యంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప‌రిస్థితి. ఈమె గ‌తంలో వైసీపీలో ఉన్న‌ప్పుడు ఏకంగా చంద్ర‌బాబు నాయుడినే గొడ్డ‌లి ప‌ట్టుకుని న‌రుకుతా నంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. అటువంటి గిడ్డి ఈశ్వరి అనుహ్య‌ప‌రినామాల నేప‌థ్యంలో టీడీపీ తీర్థం తీసుకుని పాడేరు ప్ర‌జ‌ల‌నే కాకుండా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కూడా షాక్ కు గురిచేశారు
 
అయితే కొంత మంది మాత్రం గిడ్డి ఈశ్వరి కేవ‌లం మంత్రిప‌ద‌విని ఆసించి టీడీపీలో చేరార‌ని, అలాగే టీడీపీ నాయ‌కులు కూడా ఆమెకు మంత్రి ప‌ద‌వి ఆశ చూపించి టీడీపీలోకి తీసుకున్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.  ఆమె ఎప్పుడైతే టీడీపీలోకి చేరారో అప్ప‌టినుంచి గిడ్డిపై పాడేరు ప్ర‌జ‌లకు వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. 
 
ఈమె వైసీపీలో ఉన్నంత కాలం రెబల్ గానే ప్ర‌వ‌ర్తించారు. ఇక ఆమె ప్ర‌వ‌ర్త‌న చూసిన జ‌నాలు కూడా 2019 లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా గిడ్డిశ్వ‌రికి మంత్రి ప‌ద‌వి ఖాయం అని అనుకున్నారు. దీంతో పాటు జ‌గ‌న్ కూడా ఆమెకు ఎంతో ప్ర‌ధాన్య‌త ఇచ్చేవారు. 
 
కానీ తెర వెనుక ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఆమె అక‌స్మ‌త్తుగా టీడీపీ తీర్థం తీసుకున్నారు. పాడేరులో వైసీపీ త‌ర‌పున అమెకు ఎంతో గుర్తింపు ప్ర‌జాధ‌ర‌ణ ఉండేది. అయితే ఒక్క‌సారిగా గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి ఫిరాయించ‌డంతో తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. అయితే ఈ క్ర‌మంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు దగ్గ‌ర‌కు రానేవ‌చ్చాయి. దీంతో గిడ్డి ఈశ్వరిపై ప్ర‌జ‌ల అభిప్రాయం తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క స‌ర్వేను నిర్వ‌హించార‌ట‌. 
 
అయితే ఈ స‌ర్వేలో ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గిడ్డి ఈశ్వరి ఓడిపోవ‌డం ఖాయం అని తేలింద‌ట‌. పైగా ఇక్క‌డ టీడీపీ కేడ‌ర్ కూడా త‌క్కువ‌గానే ఉంది. అయితే ఉన్న‌ కేడ‌ర్ లో తీవ్ర స్థాయిలో వ‌ర్గ‌విభేదాలు ఉన్నాయి. దీంతో చంద్ర‌బాబు నాయుడు, గిడ్డి ఈశ్వరిని ప‌క్క‌న పెట్టేందుకు రెడి అయ్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. గతంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును న‌మ్ముకుని వైఎస్ జ‌గ‌న్ ను తిట్టిపోసిన ఆమెకు రాజ‌కీయంగా క‌ష్ట‌మే అంటున్నారు విశ్లేష‌కులు. 
 
మొత్తానికి ఇక ఈ స‌ర్వే ప్ర‌కారం పాడేరు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ జెండానే ఎగిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు పటిష్టమైన కేడర్ పార్టీకి ఉండటం ప్లస్ పాయింట్ అయితే అదే సమయంలో పార్టీ పట్ల  కూడా జనంలో అభిమానం కనిపిస్తోంది. అయితే  ఎన్నికల నాటికి వైసీపీ తరపున బలమైన నేతను దింపేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. మొత్తం మీద గిడ్డి ఈశ్వరికి అన్ని వైపుల నుంచి చుక్కెదురు అవుతోంద‌ని చెప్పాలి.  
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.