దిమ్మతిరిగే షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:22:04

దిమ్మతిరిగే షాక్

సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కేవ‌లం ప‌ది నెల‌లు కాల వ్య‌వ‌ధి ఉన్న నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ 175 సెగ్మెంట్ ల‌లో టీడీపీ ఎమ్మెల్యేల బ‌లం ఎంత ఉందో తెలుసుకునేందుకు చంద్ర‌బాబు ర‌హ‌స్యంగా సర్వేను నిర్వ‌హిస్తున్నారట. అయితే ఇప్ప‌టికి అనంత‌పురం జిల్లాలోని 14 నియోజ‌కవ‌ర్గాల‌లో ఎమ్మెల్యేల ప‌రిపాల‌న‌ను దృష్టిలో ఉంచుకుని ఒక‌ స‌ర్వేను చంద్ర‌బాబు నిర్వ‌హించారు. 
 
ఈ స‌ర్వేలో ప‌లు కీల‌క అధారాలు బ‌య‌ట ప‌డ్డాయి. ప్ర‌జ‌ల అండ‌తో గెలిచిన టీడీపీ అధికారులు ఇంత‌వ‌ర‌కూ జిల్లాలో ఒక్కచోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మం చేయ‌లేద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ ఓటుతో టీడీపీ అధికార నాయ‌కులుకు బుద్ది చెప్పెందుకు సిద్దంగా ఉన్నార‌ని ఈ స‌ర్వేలో తేలింది. 
 
ఇక ఈ స‌ర్వే వివ‌రాలు చంద్ర‌బాబు దృష్టికి చేర‌డంతో అనంత టీడీపీ ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను హుటా హుటీన అమ‌రావ‌తికి పిలిపించుకుని వారికి క్లాస్ తీసుకున్నార‌ట‌. అయితే ఇంకా సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఇంచు మించు ఏడాది కాల వ్య‌వ‌ధి ఉన్నందున ప్ర‌తీ ఒక్క‌రు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ప్ర‌జా శ్రేయ‌స్సుకు పాటు ప‌డాల‌ని సూచించారట చంద్ర‌బాబు. పాటుప‌డ‌ని నాయ‌కులు  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సీటు ఆసించ‌కూడ‌ద‌ని తెగేసి చెప్పార‌ట చంద్ర‌బాబు నాయుడు.
 
ఇక ఇదే క్ర‌మంలో విజ‌య‌వాడ జ‌లీల్ ఖాన్ నియోజ‌కవ‌ర్గంలో కూడా తాజాగా స‌ర్వేను నిర్వ‌హించార‌ట చంద్ర‌బాబు.ఈ స‌ర్వేలో కూడా జ‌లీల్ ఖాన్ కు యాంటీగానే రిజ‌ల్స్ వ‌చ్చాయట‌. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచారు ఖాన్. అయితే మ‌ధ్య‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసందే. 
 
ఆ తర్వాత నుంచీ చంద్ర‌బాబు మెప్పు కోసం ఏ మాత్రం ప్ర‌జా బ‌లం లేని జలీల్ ఖాన్ ను వైసీపీ త‌ర‌పున పోటీ చేయించి గెలిపించిన జగన్ ను కించపరిచేలా మాట‌ట్లాడుతూ వ‌చ్చారు ఆయ‌న. అయితే ఈ ప్ర‌య‌త్నాల‌న్ని జ‌లీల్ ఖాన్ సీటును మాత్రం కాపాడ‌లేక పోతున్నాయి.
 
రీసెంట్ గా స‌ర్వే నిర్వ‌హించిన చంద్ర‌బాబుకు జ‌లీల్ ఖాన్ పై ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం న‌మ్మ‌కం ఉందో తేలింద‌ట‌. ఇక ఈ స‌ర్వే వివ‌రాలు, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేయిస్తే క‌చ్చితంగా జ‌లీల్ ఖాన్ ఓట‌మి పాలు కావ‌డం ఖాయం అని ఈ స‌ర్వేలో తేలింది. అలాగే దీనికి తోడు బీకాం లో ఫిజిక్స్ ఎపిసోడ్ విన్న ప్ర‌జ‌లంతా జ‌లీల్ ఖాన్ ను పూర్తి గా మ‌రిచిపోయార‌ట‌. ఇక ఈ విష‌యాల‌న్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న చంద్ర‌బాబు జలీల్ ఖాన్‌కి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని స్ప‌ష్టం చేశార‌ట‌. ఒక వేళ‌ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పార‌ట‌.
 
ఇక చంద్ర‌బాబు ఈ చేదు క‌బురు తియ్య‌గా చెప్ప‌డంతో ప్ర‌స్తుతం జ‌లీల్ ఖాన్ ఏ పార్టీలో చేరాలా అనే విష‌యంపై దీర్ఘంగా ఆలోచిస్తున్నార‌ట‌. తిరిగి సొంత గూటికి చేరే అవ‌కాశం కూడా లేదు ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు మెప్పు కోసం వైఎస్ జ‌గ‌న్ ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు కాబ‌ట్టి వైసీపీలోకి  వెళ్ల‌రు. సో వాట్ నెక్ట్స్ జ‌లీల్ ఖాన్ అంటున్నారు జిల్లా వాసులు. మ‌రోవైపు జ‌గ‌న్ని విమ‌ర్శించినందుకు త‌గిన శాస్తే జ‌రిగింద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.