అఖిల ప్రియ టెన్షన్ టెన్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 17:43:53

అఖిల ప్రియ టెన్షన్ టెన్ష‌న్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుత‌న్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు త‌మ‌కు అధిష్టానం సీటు కేటాయించాల‌ని ఎత్తుల‌కు పై ఎత్తుల‌ను వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సెగ రాయ‌ల‌సీమకు భారీగా తాకింది. ఇక‌ క‌ర్నూల్ రాజ‌కీయం గురించి పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌సరం లేదు. ఎందుకుంటే గ‌తంలో దేశ రాజ‌కీయాల‌నే ఆర్చ‌ర్య‌ప‌రిచేలా చేసింది ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం. 
 
ఈ ప్రాంతాల్లో నాటి నుంచి నేటి వ‌ర‌కూ భూమా ఫ్యామిలీదే హవా. ఎన్నిక‌ల్లో ఈ ఫ్యామిలీకి  వ్య‌తిరేకంగా ఎవ‌రు పోటీ చేసినా డిపాజిట్లు కూడా సంపాదించుకోలేరు. అంత‌టి ప్రావిణ్యం ఉన్న భూమా ఫ్యామిలీకి శోభా, భూమా అకాల మ‌ర‌ణం త‌ర్వాత అంచ‌లంచెలుగా ప్ర‌జ‌ల‌కు ఈ ఫ్యామిలీపై వ్య‌తిరేక‌త పెరిగిపోతుంద‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
ఏ క్ష‌ణం అయితే భూమా ఫ్యామిలీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకుందో అప్ప‌టినుంచి వారి కుటుంబానికి మ‌న‌శ్శాంతి లేకుండా పోయింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. గ‌తంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆజన్మశత్రువులైన‌ నాయకులను తప్పనిసరిగా గెలిపించాలన్న షరతుల పుణ్యమాఅని భూమా నాగిరెడ్డి ఒత్తిడికి గురయ్యాడు.
 
ఇక ఇప్పుడు అఖిల ప్రియ అంతకు మించిన ఒత్తిడి ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందిని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఇక ఇప్పుడు తన పెళ్లి ఏర్పాట్లలో ఉన్న అఖిలప్రియకు మనశ్శాంతి లేకుండా చేసే చర్యలు తీసుకున్నార‌ట‌ చంద్రబాబు. ప్ర‌శాంతంగా పెళ్లి హడావిడిలో ఉన్న అఖిల ప్రియ‌కు తెలియ‌కుండా చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి త‌న నివాసానికి ర‌ప్పించుకుని ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయం అడిగి తెలుసుకున్నార‌ట‌. 
 
ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల ప్రియ మంత్రి అయ్యాక టీడీపీ ఫివ‌ర్ పూర్తిగా త‌గ్గిపోయింద‌ని, దీంతోపాటు భూమా ఫ్యామిలీపై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని, మంత్రి ప‌ద‌విలో ఉన్నాకుడా ఒక్క అభివృద్ది కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేద‌ని ఏవీ సుబ్బారెడ్డి, చంద్రబాబుకు వివ‌రించార‌ని విశ్లేష‌కులు తెలుపుతున్నారు. ఆ ప్రాంతాల్లో ప్ర‌ధాన‌ స‌మ‌స్య నీటి స‌మ‌స్య అధి కూడా అఖిల ప్రియ‌ నెర‌వేర్చ‌లేద‌ని అన్నార‌ట ఏవీ. 
 
ఇక ఈ విష‌యాల‌న్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రైతే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను నెర‌వేర్చి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వెళ్తారో వారికే 2019 ఎన్నిల్లో టికెట్ ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ట‌. ఇక ఇప్పుడు చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల అఖిల‌ప్రియ టెన్ష‌న్ టెన్ష‌న్ గా ఉంద‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.