సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు బాబు షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-14 15:55:34

సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు బాబు షాక్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఎపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు షాక్ ఇవ్వ‌నున్నారా! సిట్టింగ్ ఎమ్మెల్యేల  ప్ర‌వ‌ర్త‌న చూసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీకి చేయించ‌నున్నారా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. సార్వత్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల అభిప్రాయం తెలుసుకునేందుకు ఒక ర‌హ‌స్య స‌ర్వేను నిర్వ‌హించారట‌.
 
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో చంద్ర‌బాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా రిజ‌ల్స్ వ‌చ్చాయ‌ట‌. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాల‌కుగాను సుమారు 145 స్థానాల్లో వైసీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయం అని తెలిపింది. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్టాత‌రంతో కూడుకున్న పరిస్థితి ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని తెలిపింది. 
 
గ‌తంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిస్తే త‌మ నియోజ‌కవ‌ర్గంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని భావించి ప్ర‌జ‌లు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను గెలిపించారు. కానీ వీరు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతూ ఒక్క‌చోట కూడా అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని ఈ స‌ర్వేలో తేలింది. అంతేకాదు తాము సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ము కాబ‌ట్టి ఏం చేసినా ఎదురులేద‌ని, త‌మ‌ను కాద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు బ‌రిలోకి దిగ‌ర‌ని, ఎట్టి ప‌రిస్థితిలో తామే టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తామ‌ని ధీమాగా ఉన్నారు. 
 
ఇక వీట‌న్నింటిని చంద్ర‌బాబు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అమ‌రావ‌తిలో పార్టీ ఎమ్మెల్యేలంద‌రిని పిలిపించి అత్య‌వ‌స‌ర స‌మావేం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ప్ర‌తీ ఒక్క‌రికి చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నారట‌. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రు ప్ర‌జాధ‌ర‌ణ తెచ్చుకోవాల‌ని లేక‌పోతే పార్టీ త‌ర‌పున ఏం ఆశించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. 
 
అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కూడా చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు సీటు క‌న్ఫామ్ గా ఇస్తాన‌ని చెప్ప‌లేన‌ని నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్దిని చూసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కేటాయిస్తాన‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.