జ‌లీల్ ఖాన్ టికెట్ బాబు ఆయ‌న‌కే ఫిక్స్ చేశారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 18:12:31

జ‌లీల్ ఖాన్ టికెట్ బాబు ఆయ‌న‌కే ఫిక్స్ చేశారు

తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో మొద‌టిసారిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ జ‌గ‌మోహ‌న్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అధికార ప్రలోభాలకు ఆశ‌ప‌డి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సమ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
 
అయితే ఈ 23 మందిలో దేశ‌వ్యాప్తంగా ఫేమ‌స్ అయిన ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్.  ఈయ‌న పార్టీ ఫిరాయించిన త‌ర్వాత ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్స్ స‌బ్జెక్ట్ ఉంద‌ని చెప్పి ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు. 
 
ఎన్నిక‌లు ద‌గ్గరకు వ‌స్తున్న త‌రుణంలో బీకాంలో ఫిజిక్స్ ప‌రిస్థితి గంద‌ర గోళంగా మారుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా విజ‌య‌వాడ వెస్ట్ నుంచి తాను టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర వివ‌రించినా కూడా అందుకు ఆయ‌న సానుకులంగా స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. ఇక ఎలాగో త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని గ్ర‌హించిన జ‌లీల్ ఖాన్ క‌నీసం త‌న టికెట్ త‌న కూతురుకు అయినా ఇవ్వాలని అధిష్టానానికి తెలిపారు. 
 
కానీ త‌న కూతురు విష‌యంలో కూడా ముఖమంత్రి చంద్ర‌బాబు స్పందిచ‌లేద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యవాడ వెస్ట్ నుంచి జ‌లీల్ ఖాన్ కు బ‌దులు కొత్త‌వారి కోసం ముఖ్య‌మంత్రి జ‌ల్ల‌డ ప‌డుతున్నార‌ట‌. అయితే ఈ క్ర‌మంలో నిమ్రా కాలేజ్ ఎండీ ర‌సూల్ ఖాన్ ఈ నెల 13వ తేదిన టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. అయితే ఆయ‌న‌ను విజ‌య‌వాడ వెస్ట్ నుంచి చంద్ర‌బాబు పోటీ చేయించేందుకు సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
అందుకు టీడీపీ నాయ‌కులు ఓకే చెప్ప‌డంతో ద‌రిదాపు ర‌సూల్ ఖాన్ ను ఫిక్స్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ర‌సూల్ ఖాన్ విజ‌య‌వాడ వెస్ట్ నాయ‌కుడు కాదు అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎలా రిసీవ్‌ చేసుకుంటార‌ని టీడీపీ అధిష్టానంలో పెద్ద ప్ర‌శ్న‌.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.