బాబు ఇస్తే తీసుకోండి కానీ..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan mohan reddy image,
Updated:  2018-03-04 06:29:44

బాబు ఇస్తే తీసుకోండి కానీ..

ప్ర‌తి ప‌క్ష‌నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అద్య‌క్షుడు,  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగున ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ఈ సంక‌ల్ప యాత్ర‌లో న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌క‌టిస్తూ తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకుసాగుతున్నారు జ‌గ‌న్...ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది...అయితే ఈ క్ర‌మంలో మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై త‌న గ‌ళాన్ని విప్పారు జ‌గ‌న్... 
 
 ప్ర‌కాశం జిల్లా అద్దంకిలో జ‌రిగిన  స‌భ‌లో పాల్గొన్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిపై ఫైర్ అయ్యారు... ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ... చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల సొమ్మును అక్ర‌మంగా దోచుకుని, వారిని రోడ్డున ప‌డేలా చేస్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు... వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో ప్ర‌తీ  ఓటరుకు చంద్ర‌బాబు మూడు వేల రూపాయ‌లు ఇచ్చేందుకు వ‌స్తే... మాకు మూడువేలు కాదు ఐదు వేలు కావ‌ల‌ని బాబును అడ‌గండ‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు స‌ల‌హా ఇచ్చారు... ఆయ‌న పంచ‌బోయే డ‌బ్బంతా ప్ర‌జ‌ల నుంచి దోచుకున్న‌దే అని అన్నారు... బాబు ద‌గ్గ‌ర డ‌బ్బు తీసుకుని మీ మ‌న‌స్సాక్షి చెప్పిన వారికే ఓటు వేయాల‌ని సుచించారు జ‌గ‌న్... ..
 
అందులో భాగంగానే సంక‌ల్ప‌యాత్ర‌లో  చంద్రబాబుకు సూట‌య్యేలా  ఒక సామేత చెప్పారు జ‌గ‌న్... ఒక క్రికెట్ మ్యాచ్ లో ఒక బ్యాట్ మాన్, ఒక బౌల‌ర్ ఫిక్సింగ్ చేసుకుంటే అది  ఒక‌టి లేదా రెండు మ్యాచ్ ల‌కు న‌ష్టం వాటిళ్లుతుంద‌ని, అదే కెప్టెన్ ఫిక్సింగ్ కు పాల్ప‌డితే అది జ‌ట్టును మొత్తం నాశ‌నం చేస్తాద‌ని అన్నారు జ‌గ‌న్... అయితే ఇప్పుడు చంద్ర‌బాబు కెప్టెన్ ప‌ద‌విలో ఉంటూ  కేంద్రానికి అమ్ముడు పోయి రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నారని అన్నారు.. రాష్ట్రం మొత్తం హోదా కోసం కేంద్రంతో ఉథ్య‌మాలు చేస్తుంటే చంద్ర‌బాబు ఏ మాత్రం చిత్త‌సుద్ది లేకుండా కేంద్ర మంత్రుల‌తో రాజీనామ చేయించ కుండా వారిని మ‌భ్య‌పెట్టే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని జ‌గ‌న్ చంద్ర‌బాబుపై ఫైర్ అయ్యారు...
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.