హుటా హుటీన బాబు ఢిల్లీకి ప్ర‌యాణం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-10-27 11:32:51

హుటా హుటీన బాబు ఢిల్లీకి ప్ర‌యాణం

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకుని టీడీపీ ఎంపీల‌తో స‌మావేశం కానున్నారు. హ‌స్తిన వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ల గురించి మాట్లాడాల‌ని చంద్ర‌బాబు నాయుడు డిసైడ్  అయ్యారు. అంతేకాదు ఈ టూర్ లో ప‌లువురు జాతీయ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు క‌లిసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి, ఆప‌రేష‌న్ గ‌రుడ అంశాల‌ను దేశ ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని టీడీపీ నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. 
 
నాలుగు సంవ‌త్స‌రాల నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్రప్ర‌దేశ్ కు మొండిచెయ్ చూపించింద‌ని, అలాగే తిత్లీ తుఫాన్‌ పై స్పందించ‌క‌పోవ‌డం, విభ‌జ‌న అంశాల పెండింగ్ అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వాన్ని టీడీపీ నాయ‌కులు నిల‌దీయాల‌ను కుంటున్నారు. గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను కేంద్రం వాడుకుంటోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

షేర్ :

Comments